పర్యాటకులకు స్వర్గధామం 'లోహగఢ్ ఫోర్ట్'.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా..?

మహారాష్ట్రలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో సహ్యాద్రి శ్రేణుల పర్వతాల మధ్య దాగి ఉంది. దట్టమైన అడవులు, జలపాతాలతో అలాగే అందమైన బీచ్ లతో నిండి ఉంటుంది. అంతేకాక ఇక్కడి కోటలు, కట్టడాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రసిద్ధమైన హిల్ స్టేషన్స్ దాగి ఉన్నాయి. మహాబలేశ్వర్, లోనావాలా- ఖాండాలా, మాథెరాన్, చిఖల్ దరా తదితర ప్రాంతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి. అలాగే భండర్దరా, తోసేఘర్ జలపాతం, లోనార్ సరస్సు ఉన్నాయి. అయితే మహారాష్ట్ర అనగానే అందరికీ లోహగఢ్ ఫోర్ట్ మాత్రమే గుర్తుకొస్తుంది.

మహారాష్ట్రలోని లోహగఢ్ ఫోర్ట్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదొక చారిత్రక కట్టడం. ఈ కోట సముద్ర మట్టానికి 1,033 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంది. ఈ కోట ముఖ్యంగా అడ్వెంచర్ జర్నీ, ట్రెక్కింగ్ చేసేవారికి మరచిపోలేని అనుభూతిని కలిగిస్తోంది. కోట పైభాగంలో దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవునా సాగి ఉండే సన్నని కొండ చరియ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ వాకింగ్ చేస్తే మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.

అప్పట్లో శత్రువులు కోటలోకి రాకుండా ఉండేందుకు నిర్మించిన గణేష్, నారాయణ, హనుమాన్, మహా దర్వాజా అనే నాలుగు ప్రవేశాలు.. వీటిపైన దాగిన శిల్పకళ పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే లోహగఢ్ కోటలో మరికొన్ని కోటలు కూడా ఉన్నాయి. అవి విసాపూర్ కోట, భజా గుహలు, కార్లా గుహలు, పావనా సరస్సు ఉన్నాయి. వర్షాకాలంలో ఇది ముఖ్యమైన ఫొటోగ్రఫీ స్పాట్ గా ఉంది.

lohagadfort Maharashtra Tour Complete Details How to Reach Best Time and Travel Guide Lohagad Fort

జూన్ నుంచి సెప్టెంబర్ లో ఈ ప్రాంతం దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రెక్కింగ్ చాలా ఫేమస్.. కోటను ఎక్కేందుకు మెట్లు, కాంక్రీట్ మార్గం నిర్మించారు. దాంతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ కోటను సులభంగా ఎక్కొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు రైలు, విమాన మార్గం, రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మీరూ ఓసారి లోహగఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ ట్రై చేయండి..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+