Vande Bharat Express: నెల్లూరులో వందే భారత్ టైమింగ్ మార్పు..!
భారతీయ రైల్వేల్లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్లలో వందే భారత్ (Vande Bharat Express) ఎక్స్ ప్రెస్ లు కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అయితే వీటికి లభిస్తున్న ప్రజా దరణ నేపథ్యంలో రైల్వే కూడా ఎప్పటికప్పుడు వీటిలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నెల్లూరు స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్ లో మార్పు జరిగింది.
చెన్నై ఎంజీఆర్ స్టేషన్ నుంచి నరసాపూర్ కు ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20677లో ఈ మార్పు చోటు చేసుకుంది. చెన్నై నుంచి నరసాపూర్ వచ్చే ఈ వందే భారత్ రైలు ప్రస్తుతం నెల్లూరులో ఉదయం 8.29కు ఆగుతుండగా.. ఇకపై 8.41కు మారుస్తూ దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి నెల్లూరులో వందే భారత్ రైలు ఎక్కే ప్రయాణికులు ఈ మార్పు గమనించాల్సి ఉంటుంది.

గతంలో ఇదే రైలు చెన్నై నుంచి విజయవాడ మధ్య రాకపోకలు సాగించేది. తాజాగా ప్రయాణికుల డిమాండ్ మేరకు దీన్ని నరసాపురం వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రైలు ప్రయాణ సమయాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో నెల్లూరు స్టేషన్లోనూ ఈ వందే భారత్ ఆగే సమయంలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి అమల్లోకి వస్తున్న ఈ మార్పు ఇకపై రెగ్యులర్ గా కొనసాగబోతోంది.














Click it and Unblock the Notifications