నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్!

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎంతోమంది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అటువంటి వారి కోసం రైల్వే శుభవార్త తెచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న యువకులకు రైల్వే శాఖ నుంచి బంపర్ అవకాశం వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ మరియు గ్రేడ్-3 విభాగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం వివిధ ట్రేడ్లలో నియామకాలు జరుగనున్నాయి. ట్రాక్ మెషిన్, బ్రిడ్జ్, డీజిల్ ఎలక్ట్రికల్/మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ తదితర డిపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి.

railway jobs good news to unemployed as RRB given a huge 6557 posts notification for technicians

ప్రారంభమైన ఆన్ లైన్ అప్లికేషన్ లు

10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18-33 ఏళ్లు, గ్రేడ్-3కి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు జూన్ 30, 2026 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి.

ఫీజు వివరాలు, పరీక్షా విధానం ఇలా

జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఇతర రిజర్వ్డ్ వర్గాలు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీబీటీ పరీక్షకు హాజరైతే ఫీజులో కొంత భాగం రీఫండ్ అవుతుంది. పరీక్ష విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్ & ఇంజినీరింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు పర్మిషన్ కావాలంటే ఆ పని తప్పనిసరి!
హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు పర్మిషన్ కావాలంటే ఆ పని తప్పనిసరి!

తుది ఎంపిక ఇలా

నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు చదివి అప్లై చేసుకోవాలి. ఇది రైల్వేలో ఉద్యోగం కోరుకునే వారికి గొప్ప అవకాశం గా చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం జూలై 29 లోపు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకుని, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపొండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+