పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం స్థానిక సంస్థల పోలింగ్ ఆరంభమైంది. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భీతావహ వాతావరణం నెలకొన్నట్లు చెబుతున్నారు. ఆయా చోట్ల ఓటింగ్ ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటోన్నారని, పోలీసుల సహకారంతో తమ పార్టీ ఏజెంట్లను సైతం పోలింగ్ కేంద్రాల నుంచి బయటికి పంపేస్తోన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.

దీనికి అనుగుణంగా పలుచోట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం హౌస్ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, మాచర్ల, వినుకొండల్లో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్ అయినట్లు వార్తలొచ్చాయి. కొందరు వైసీపీ నేతలపై బైండోవర్ కేసులు సైతం నమోదైనట్లు సమాచారం.

Tension prevailed in Pulivendula After Dastagiri intercepted the convoy of former CM YS Jagan argued

ఈ పరిణామాల మధ్య కడప జిల్లా పులివెందులలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారును దస్తగిరి అడ్డుకున్నాడు. జగన్ కారుకు అడ్డుగా తన కారును నిలిపాడు. జగన్ తో వాగ్వివాదానికి దిగాడు. నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వైరల్ అయ్యాయి. దస్తగిరి.. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.

ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!
ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!

ఈ ఉదయం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ లో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో ఆయన కారుకు దస్తగిరి అడ్డుపడ్డాడు. తన కారును అడ్డుగా పెట్టాడు. కారు నుంచి కిందికి దిగి జగన్ తో వాగ్వివాదానికి దిగాడు. దీంతో జగన్ కారు డోర్ వద్ద నిల్చోవడం కనిపించింది. ఆ సమయంలో దస్తగిరి.. జగన్ కారు దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అనంతరం అతని కారును పక్కకు తొలగించడంతో జగన్ కారు ఇంటికి బయలుదేరి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+