10 నిమిషాల్లో లేపేస్తాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్ అణు రంగాన్ని, సైనిక స్థావరాలను గురిచేసి తాము చేపట్టిన దాడుల దాటికి ఆ దేశ బలగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇరాన్ అణు సామర్థ్యాలను, సైనిక వ్యవస్థలను ఇప్పటికే అమెరికా దళాలు సమర్థవంతంగా ధ్వంసం చేశాయని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ఒకటి రెండు కీలక అణు స్థావరాలను కూడా కేవలం "పది నిమిషాల్లో" నేలమట్టం చేయగల సామర్థ్యం తమ దళాలకు ఉందంటూ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అణు కేంద్రాలు క్లోజ్.. 10 నిమిషాల వ్యవధిలోనే దెబ్బతీస్తాం!

ఇరాన్‌కు చెందిన నౌకాదళం, వాయుసేన, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ నెట్‌వర్క్, రక్షణ పరికరాల తయారీ విభాగాలను అమెరికా బలగాలు ఇదివరకే కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని ట్రంప్ వివరించారు. అయితే, భూగర్భంలో అత్యంత భద్రంగా ఉండే 'పిక్-యాక్స్ మౌంటైన్' వంటి ప్రధాన కేంద్రాలు సహా ఒకటి రెండు అణు స్థావరాలు మాత్రమే ఇప్పటికీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని కూడా తుడిచిపెట్టడానికి తమకు ఎక్కువ సమయం పట్టదని, ఆదేశాలు ఇచ్చిన పది నిమిషాల్లోనే ఆ పని పూర్తి చేయగలమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి తదుపరి దాడులు చేయడానికి తమకేమీ అత్యవసరమైన హడావుడి లేదని వెల్లడించారు.

Trump Warns Iran Can Strike Remaining Nuclear Sites in 10 Minutes Claims Tehran Wants to Make a Deal
'అబ్దుల్ ఓ జిహాదీ!'.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!
'అబ్దుల్ ఓ జిహాదీ!'.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!

చర్చలకు ఇరాన్ సై.. కానీ నమ్మలేం: ట్రంప్ స్పష్టీకరణ

ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందని, ఆ దిశగా కొన్ని సంకేతాలు వచ్చాయని డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ దేశ విశ్వసనీయతపై తమకు ఎంతో అనుమానం ఉందన్నారు. "ఒప్పందం చేసుకున్నట్టే చేసుకుని, తర్వాత వెనక్కి తగ్గడం ఇరాన్‌కు అలవాటే" అని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి దాడులు చేసే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి విషయాలను బహిరంగంగా వెల్లడించలేనంటూ సమాధానాన్ని దాటవేశారు.

నీ బాడీని షేప్‌లో పెట్టుకో. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు
నీ బాడీని షేప్‌లో పెట్టుకో. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు

మరోవైపు, సైనిక చర్యల ఆందోళనల నడుమ అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జార్జియా వేదికగా జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు ముగింపులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. భద్రతాపరమైన హామీలు లభిస్తే దౌత్యపరమైన పరిష్కారానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. మధ్యవర్తుల ద్వారా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ధ్రువీకరించారు. ఇరాన్ ప్రముఖ భద్రతా అధికారి మొహసేన్ రెజాయ్ కూడా స్పందిస్తూ.. ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిన లేఖలోని స్వరం మారిందని, తమ వైపు నుంచి ఇది మంచి సంకేతమని అభిప్రాయపడ్డారు. అయితే ఇరాన్ అత్యున్నత నాయకత్వం మాత్రం అమెరికా, ఇస్రాయెల్‌లు ఏ చిన్న పొరపాటు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+