ట్రంప్ కు అమెరికా కోర్టులో ఎప్ స్టీన్ షాక్..! వాల్ స్ట్రీట్ వివాదంలో..!

వివాదాస్పద లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు పుట్టినరోజు లేఖ రాసినట్లు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనం తప్పంటూ కోర్టుకెక్కిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు (Donald Trump) ఎదురుదెబ్బ తప్పలేదు. ఎప్ స్టీన్ తో తన బంధాన్ని తప్పించుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నం కాస్తా విఫలమైంది. ఎప్ స్టీన్ కు ట్రంప్ పంపిన అశ్లీల లేఖపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించగా.. అది కల్పితం అంటూ ట్రంప్ కోర్టులో దావా వేశారు. అయితే ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావాను విచారణ జరిపిన కోర్టు.. దీన్ని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

కేంద్రం సంచలన నిర్ణయం..! పాకిస్తాన్ కు ఢిల్లీ ఆహ్వానం..!
కేంద్రం సంచలన నిర్ణయం..! పాకిస్తాన్ కు ఢిల్లీ ఆహ్వానం..!

గతంలో ఎప్ స్టీన్ కు ట్రంప్ ఆశ్లీల లేఖ రాశారంటూ వాల్ స్ట్రీట్ ప్రచురించిన కథనంపై ఆయన కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో .. ఆయన పిటిషన్ సవరించుకునేందుకు అవకాశం దక్కింది. అయినా దాన్ని సవరించకుండా అలాగే దావా కొనసాగించిన ట్రంప్ కు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ పరువునష్టం దావాను సవరించడానికి కానీ లేక తిరిగి దాఖలు చేయడానికి కానీ వీల్లేగుండా ఈసారి న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు.

Donald Trump Suffers Legal Setback as Judge Dismisses Lawsuit Against Wall Street Journal
ఐరాస వేదికగా ట్రంప్ కు భారత్ బిగ్ షాక్..! మరో 129 దేశాలతో కలిసి..!
ఐరాస వేదికగా ట్రంప్ కు భారత్ బిగ్ షాక్..! మరో 129 దేశాలతో కలిసి..!

ఈ సందర్భంగా కోర్టు వాల్ స్ట్రీట్ పత్రిక అనుసరించిన పత్రికా ప్రమాణాలతో ఏకీభవించింది. ఈ కథనం ప్రచురణకు ముందే డొనాల్డ్ ట్రంప్ స్పందన తీసుకునేందుకు పత్రిక ప్రయత్నించడం, ఆయన ప్రత్యక్షంగా ఈ కథనాన్ని ఖండిస్తూ ఇచ్చిన ప్రకటనల్ని కోర్టు గుర్తించింది. పరువు నష్టం దావాల్ని కొనసాగించేటప్పుడు ప్రముఖులు పాటించాల్సిన ఉన్నత న్యాయ ప్రమాణమైన వాస్తవ దురుద్దేశాన్ని ట్రంప్ ఫిర్యాదు ఇప్పటికీ నిరూపించడంలో విఫలమైందని కోర్టు నిర్దారించింది. దీంతో న్యాయమూర్తి డారిన్ పి గేల్స్ తుది కొట్టివేత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాది వాస్తవ దురుద్దేశంతో పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని అధ్యక్షుడు ట్రంప్ విశ్వసనీయంగా ఆరోపించడంలో విఫలమైనందున, సవరించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోర్టు తీర్పులో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+