Palash Muchhal: స్మృతీ మందాన కు పలాష్ తాజా షాక్ లు...! 10 కోట్ల పరువునష్టం దావా సహా..!
గతేడాది మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ విజయం తర్వాత అందులో భాగస్వామిగా ఉన్న ఓపెనర్ స్మృతీ మంథన(smriti mandhana)తో పెళ్లికి ఎంగేజ్ మెంట్ చేసుకున్న పలాష్ ముచ్చల్ (palash muchhal) కు బిగ్ షాక్ తగిలింది. స్మృతీ తండ్రి ఆస్పత్రి పాలుకావడంతో ఈ పెళ్లిని ఆమె కుటుంబ సభ్యులు అర్ధాంతరంగా వాయిదా వేసారు. ఆ తర్వాత ఏకంగా రద్దు చేసుకున్నారు. దీని వెనుక ఉన్న కారణాలపై రకరకాల చర్చలు జరిగాయి. అయితే తాజాగా స్మృతి స్నేహితుడు విద్య్నాన్ మానే ఈ నిర్ణయం వెనుక కారణాల్ని బయటపెట్టాడు.
పలాష్ ముచ్చల్ కు మరో మహిళతో సంబంధాలు ఉన్నాయని, ఆమెతో బెడ్ రూమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని, దీంతో స్మృతీ తోటి క్రికెటర్లు సైతం అతన్ని కొట్టారని కూడా మానే ఆరోపించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్మృతీ-పలాష్ పెళ్లి పెటాకులు అయిన తర్వాత మానే చేసిన ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ క్రికెట్ వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్మృతీ తన పెళ్లి రద్దుకు గల కారణాల్ని ఇప్పటివరకూ బయటపెట్టకపోవడం, ఇప్పుడు ఇలా ఆమె స్నేహితుడు బయటపెట్టడం చర్చనీయాంశమవుతోంది.

ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ వీటిపై తీవ్రంగా స్పందించాడు. తనపై ఆరోపణలు చేసిన స్మతి మంతన స్నేహితుడు మానేపై మండిపడ్డాడు. ఈ ఆరోపణలు నిరాధారమైనవంటూ నిన్న వివరణ ఇచ్చాడు. దీనిపై న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాడు. అన్నట్లుగానే 10 కోట్లకు పరువునష్టం దావా నోటీసులు పంపాడు. అంతటితో ఆగకుండా ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్న తన మాజీ లవర్ స్మృతీ మంథనా ఫొటోల్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసాడు. దీంతో ఇద్దరి మధ్య పెళ్లి రద్దు తర్వాత నెలకున్న మౌనం కాస్తా యుద్దంగా మారుతోంది.












Click it and Unblock the Notifications