ఉచ్ఛస్థితిలో బృహస్పతి.. ఈ రాశులవారికి కలిసొస్తుంది కానీ...

దేవతల గురువైన బృహస్పతి జూన్ రెండవ తేదీ నుండి కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. బృహస్పతి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉచ్ఛ స్థితిలోనే కొనసాగుతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి శుభాలను ఇవ్వనున్నాడు. మరి బృహస్పతి దయతో అదృష్టం కలిసివచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభరాశి:

వృషభరాశి వారికి తృతీయ స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల ఆదాయ వృద్ధి పెరుగుతుంది. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకుండా ఉంటే మంచిది.

Jupiter exaltation till October 31 These zodiac signs should get luck but careful with finances

సింహరాశి:

సింహ రాశి వారికి వ్యయ స్థానంలో గురువు సంచారం కారణంగా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి . లాభదాయక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాలు, ఇళ్ళు, వాహనాలు వంటి వాటిపై ఖర్చులను తగ్గించుకోవాలి . పొదుపు చేయడం నేర్చుకోవాలి.

తులారాశి:

తుల రాశి వారికి దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పురోగతి పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొద్ది ప్రయత్నంతోనే రావలసిన డబ్బులు అందుతాయి.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగం చేసే వారికి జీతాలు పెరుగుతాయి. ధనస్సు రాశి వారికి ఇది చాలా మంచి సమయం.

మకర రాశి:

మకర రాశి వారికి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్ఛ స్థితిలో ఉండటం కారణంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉంటే మంచిది. సంపాదించిన డబ్బును పొదుపు చేసుకుంటే బాగుంటుంది. ఈ సమయంలో మీకు గతంలో పెట్టిన పెట్టుబడి నుండి లాభం వస్తుంది.

ఆగస్ట్ నెలంతా వీరికి జాక్ పాట్ ప్రకటించిన విలాసాల అధిపతి!
ఆగస్ట్ నెలంతా వీరికి జాక్ పాట్ ప్రకటించిన విలాసాల అధిపతి!

కుంభ రాశి:

కుంభ రాశి వారికి షష్ఠ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం చేయడం వల్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అదనపు ఆదాయాన్ని సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలి. ఆర్థిక లాభాలను మదుపు చేయటం, డబ్బు పొదుపు చేయటం చాలా అవసరం.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+