బంగారం ధరల్లో భారీ ఉపశమనం
నేడు.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ కు ట్రేడింగ్ హాలిడే కావడం వల్ల వాటి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ.. కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా సంభవిస్తోన్న భౌగోళిక, రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీని ఫలితంగా గత 10 రోజుల్లో బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగొచ్చాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ లో కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి.
మొత్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 5,840 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 5,050 మేర తగ్గింది. 18 క్యారెట్లల్లో రూ. 4,630 మేర క్షీణత కనిపించింది. పసిడితో పోలిస్తే వెండి ధరల్లో ఈ తగ్గుదల మరింత అధికం. ఇండస్ట్రీయల్ డిమాండ్ తగ్గడంతో కిలో వెండి ధర 10 రోజుల్లో రూ. 25,500 వరకు పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,00,000 కంటే దిగువకే స్థిరపడింది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,880 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,27,300 కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,38,810 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,27,280 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,38,980, రూ. 1,27,400 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,38,880, 22 క్యారెట్లు రూ. 1,27,300 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,888, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416
ముంబై..
24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416













Click it and Unblock the Notifications
