రంగు మారే టమోటాలతో భారీ లాభాలు! రైతుల కష్టాలు తీర్చే అద్భుత టెక్నాలజీ

వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు తెరతీశారు. పొలంలో నైట్రోజన్ శాతం తగ్గినప్పుడు వెంటనే రంగు మారి రైతులకు సంకేతాలు పంపే కొత్త రకం టమోటా మొక్కలను రూపకల్పన చేశారు. 'రెడ్‌అలర్ట్' పేరుతో పిలిచే ఈ జన్యుమార్పిడి మొక్కలు, నేలలో పోషకాల లోపం ఏర్పడగానే ఎరుపు-ఊదా రంగులోకి మారి పంట స్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ప్రయోగశాలల నుంచి బయటకు తెచ్చిన ఈ వినూత్న మొక్కలను ప్రస్తుతం న్యూయార్క్‌లోని రీసెర్చ్ ఫామ్‌లో నిజమైన పొలం పరిస్థితులలో పరీక్షస్తున్నారు.

బీట్‌రూట్ రంగుతో పనిచేసే జీవ సంకేతాలు!

సాధారణంగా మొక్కలకు నత్రజని లోపిస్తే ఆకులు పసుపు రంగులోకి మారతాయి. అయితే ఈ మార్పును సరిగ్గా గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనిని అధిగమించేందుకు శాస్త్రవేత్త ఆశా నిలయంగా ఈ 'రెడ్‌అలర్ట్' మొక్కలను రూపొందించారు. మొక్క వేళ్ల భాగంలో నత్రజని లభ్యత తగ్గగానే, ఆ సమాచారం కాండం , ఆకులకు చేరి బీట్‌రూట్‌లో ఉండే 'బెటానిన్' అనే ఎరుపు-ఊదా వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో నేలలో ఉన్న పోషకాల లభ్యతను బట్టి మొక్కలు తమ వర్ణాన్ని మార్చుకుని రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తాయి.

Cornell Scientists Engineer Tomato Plants That Change Color to Help Farmers Monitor Nitrogen Levels
సముద్రాన్ని ముంచెత్తుతున్న 'నైట్రోజన్’ విషవలయం..
సముద్రాన్ని ముంచెత్తుతున్న 'నైట్రోజన్’ విషవలయం..

పంట దిగుబడిని కాపాడే 'సూచిక' మొక్కలు!

ఈ రకం టమోటాలను ఆహారం లేదా విక్రయం కోసం కాకుండా, కేవలం పొలంలో సమాచారాన్ని అందించే 'సూచిక మొక్కలు' (సింటినెల్ ప్లాంట్స్) గా మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని సాధారణ పంటల మధ్య అక్కడక్కడ నాటడం ద్వారా పొలంలో ఎక్కడ ఎరువుల అవసరం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా రైతులు అవసరానికి మించి దాదాపు 50 శాతం వరకు నత్రజని ఎరువులను పొలాల్లో వేస్తుంటారు. దీనివల్ల నీరు కలుషితమై పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే అవసరమైన చోట మాత్రమే నిక్కచ్చిగా ఎరువులు వేసి, వేలాది రూపాయల వృథాను అరికట్టవచ్చు.

ఇడ్లీ, దోశ నుంచి వడాపావ్ వరకు. మన వంటకాల రుచికి ఫారెనర్ ఫిదా
ఇడ్లీ, దోశ నుంచి వడాపావ్ వరకు. మన వంటకాల రుచికి ఫారెనర్ ఫిదా

పొలాల్లో జోరుగా క్షేత్రస్థాయి పరీక్షలు!

ఈ సరికొత్త విధానాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు డ్రోన్లు, ప్రత్యేక స్పెక్ట్రోమీటర్ల సహాయంతో ఆకుల రంగు తీవ్రతను శాస్త్రవేత్తలు నిరంతరం పరిశీలిస్తున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితులు, వర్షాలు , తెగుళ్ల దాడిని తట్టుకుని ఈ మొక్కలు ఎంతవరకు సరైన సమాచారాన్ని అందిస్తున్నాయో శోధిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విధానం కనుక విజయవంతమైతే, రసాయన ఎరువుల వ్యర్థాలను అరికట్టడంలో ఇది వ్యవసాయ రంగానికే ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+