వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం. 70 మంది ఏజెంట్లతో ఆర్వో దగ్గరకు... పులివెందులలో రీ-పోలింగ్?

రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల సరళిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందులలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాలను అధికార పార్టీ గూండాలు ఆక్రమించుకుని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

పులివెందుల పట్టణంలోని 80 పోలింగ్ బూత్‌లకు గాను ఏకంగా 70 కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు కట్టి, ఆక్రమణలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన ఓటర్లకు ఓటర్ స్లిప్పులను ఇవ్వకుండా లాక్కొని, "మీ ఓటు ఇప్పటికే పడిపోయింది" అని చెబుతూ వెనక్కి పంపించేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, కౌన్సిలర్ అభ్యర్థులను పోలీసులే బలవంతంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

YS Jagan Alleges Rigging in Pulivendula Local Body Polls Demands Immediate Re-Polling by Election Commission
వైఎస్ జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పులివెందులలో హైడ్రామా.!
వైఎస్ జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పులివెందులలో హైడ్రామా.!

ఈ ఎన్నికల అక్రమాల్లో అధికార పార్టీకి పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోందని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను వెనక్కి పంపడానికి పోలీసులే ముందుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీస స్పందన లేదు. అసలు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?" అని నిలదీశారు. అంతేకాకుండా బూత్‌ల వద్ద జరుగుతున్న దౌర్జన్యాలను చిత్రీకరిస్తున్న ఇండియా టుడే, ఎన్టీవీ వంటి ప్రముఖ మీడియా సంస్థల కెమెరాలను ధ్వంసం చేసి, జర్నలిస్టులపై కూడా దాడులకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి
పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి

చంద్రబాబుకు ఒక్కరోజు కూడా పీఠంపై ఉండే అర్హత లేదు.. రీపోలింగ్ డిమాండ్!

పులివెందులతో పాటు జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లె, కుప్పం, చిలకలూరిపేట వంటి ప్రాంతాల్లో ప్రజలను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబుకు ఒక్కరోజు కూడా లేదని విమర్శించారు. అక్రమాలు జరుగుతున్న 70 బూత్‌లకు చెందిన ఏజెంట్లతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పాటించడం లేదని.. పోలింగ్ బూత్స్ లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు లేవని.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసి తక్షణమే రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం ఎన్నికల అక్రమాలపై రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+