ఏపీలో మరో ఏఐ డేటా సెంటర్..! గూగుల్ కు పోటీగా దేశీయ దిగ్గజం..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేతకు డిమాండ్ పెరుగుతున్న వేళ ఏఐ డేటా సెంటర్లకు మన దేశంలో పోటీ పెరుగుతోంది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకొచ్చింది. దీంతో దేశంలోనే తొలి ఏఐ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇదే క్రమంలో ఇవాళ ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు దీనికి వేదికైంది.

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఇదే క్రమంలో రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకరించింది.

after google reliance group agrees to setup another data centre in ap

ఇందులో భాగంగా ఏఐ డేటా సెంటర్ తో పాటు , సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని రిలయెన్స్ ప్రకటించింది. దీంతో ఏపీపై నమ్మకం ఉంచి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 1 గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ అంగీకరించింది. ప్రపంచంలో అత్యంత అధునాతనమైన జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్‌లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రిలయెన్స్ తెలిపింది.

after google reliance group agrees to setup another data centre in ap

గుజరాత్ లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ గిగావాట్-స్థాయి AI డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో పని చేసేలా ఏఐ-డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. జామ్ నగర్, ఏపీలోని రెండు ఏఐ డేటా సెంటర్లతో ఆసియాలోనే అత్యంత బలమైన AI మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఈ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న AI డేటా సెంటర్‌ కోసం రిలయన్స్ 6 గిగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయనుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించడానికి కూడా రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+