AIపై ఆధారపడితే మీ ఇల్లు, ఒళ్లు గుల్లే
ఆరోగ్య చిట్కాల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడటంపై ఏ మాత్రం మంచిది కాదని ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ హెచ్చరించింది. వైద్య సలహాల కోసం ఏఐని వినియోగించడం వల్ల ప్రమాదకరమైన ఫలితాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
OpenAI, Google, Anthropic, Meta, X Corp అభివృద్ధి చేసిన ఈ అయిదు అత్యంత అధునాతన AI వ్యవస్థల నైపుణ్యాన్ని అంచనా వేయడానికి వైద్య రంగానికి చెందిన నిష్ణాతులతో కూడిన ఓ టీమ్.. రియట్ టైమ్ స్టడీ చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించింది.

AI చాట్‌బాట్‌ల పనితీరుపై అధ్యయనం
అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం- హెల్త్ కు సంబంధించినంత వరకు AI టూల్స్ ఇచ్చే సలహాలు సరైనవి కావు. చాట్‌బాట్ ఇచ్చే సలహాలు, సూచనలు రోగులను తప్పుదారి పట్టించగలదని పరిశోధకులు గుర్తించారు.
ఏఐ ఇచ్చిన సలహాల్లో 88 శాతం తప్పుగా ఉన్నాయని దక్షిణాఫ్రికా యూనివర్శిటీకి చెందిన నటాన్స్ తెలిపారు. ఆ సలహాలు ఎంతమాత్రం నమ్మదగ్గవి కావని, వాటికి శాస్త్రీయత లేదని కొట్టిపారేశారు. కల్పిత సూచనలను ఇచ్చాయని స్పష్టం చేశారు. ఈ అయిదు చాట్‌బాట్ లల్లో.. నాలుగు వందశాతం తప్పుడు సమాచారాన్ని ఇచ్చాయని, మరో ఏఐ టూల్ 40 శాతం వరకు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రజలు దాదాపు ప్రతిదానికీ AI టూల్స్ పై ఆధారపడే ఈ రోజుల్లో- ఆరోగ్య సంరక్షణ కోసం వాటిపై ఆధారపడటం మంచిది కాదని ఈ మెడికల్ జర్నల్ సూచించింది. అవి ఇచ్చే చిట్కాలను పాటించితే రోగ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రియల్ టైమ్ పరిస్థితులకు అనుగుణంగా లేవని ఈ జర్నల్ అంచనా వేసింది.
ఏఐ వినియోగం భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు, ఇతర మార్గదర్శకత్వాల కోసం లక్షలాది మంది ప్రజలు ఆయా టూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఇప్పటికే చాలామంది ఏఐపై ఆధారపడుతున్నారని, దీనికి నివారణను కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇలాంటి విషయాల్లో డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం అని సూచించింది.












Click it and Unblock the Notifications