మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల మెడపై కత్తిలా వేలాడుతున్న ఏఐ!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు సునాయాసంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు ఒక అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం మానవ వనరులపై ఊహించని విధంగా పడుతుంది.

15వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్
ఈ సంవత్సరం దాదాపు ఇప్పటివరకు 15వేల మందికి పైగా ఉద్యోగులను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తొలగించింది. ఈ సంవత్సరం కనీసం నాలుగు రౌండ్ల శ్రామిక శక్తిని తొలగించిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎక్స్ బాక్స్, గేమింగ్ విభాగం, బృందాలను ప్రభావితం చేసేలా తాజా రౌండ్ లో దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగులను తగ్గించింది.

AI effect 15000 employees lost their jobs warning to remaining employees of microsoft

Take a Poll

ఏఐ నేర్చుకుంటేనే ఉద్యోగాలు
మేలో 6000 మంది ఉద్యోగులను, జూన్లో కొన్ని వందల మంది ఉద్యోగులను తగ్గించిన మైక్రోసాఫ్ట్ మిగతావారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం సాధిస్తేనే ఉద్యోగాలు ఉంటాయని, లేదంటే ఇంటికి పంపించడం ఖాయమని తేల్చి చెప్పేసింది. కృత్రిమ మేధస్సు వినియోగం పైన ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇకపైన తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ దానిని తప్పకుండా నేర్చుకుంటేనే ఉద్యోగం ఉంటుందని తేల్చి చెప్పింది.

ఆ టూల్స్ వాడటం రాకుంటే ఇంటికే
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను బట్టి మీ పని నైపుణ్యాన్ని అంచనా వేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది . మైక్రోసాఫ్ట్ లో పనిచేసే అందరూ ఉద్యోగులకు, అన్ని విభాగాల్లో మైక్రోసాఫ్ట్ కోపిలాట్, అజూర్ ఏఐ, గిట్‌హబ్ కోపిలాట్ వంటి టూల్స్ ఉపయోగించే సామర్థ్యం అవసరమని, అవి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది.

ఏఐ కోసం భారీగా ఖర్చు చేస్తున్న మైక్రోసాఫ్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒకవైపు మైక్రోసాఫ్ట్ భారీగా వ్యయం చేస్తుంది. దీంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు చెబుతోంది. ఇప్పటివరకు ఈ సంవత్సరం ఉద్యోగుల తొలగింపు ద్వారా మైక్రోసాఫ్ట్ సుమారు 500 మిలియన్ డాలర్లను ఆదా చేసినట్టు సమాచారం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఈ సంవత్సరం మైక్రోసాఫ్ట్ 80 బిలియన్ డాలర్లను వెచ్చించనుంది.

ఉద్యోగుల మెడ పైన కత్తిలా వేలాడుతున్న ఏఐ
అయితే ఈ ఉద్యోగుల తీసివేతలు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాత్రమే కాదని, సంస్థ ఖర్చుల కట్టడికి తీసుకున్న చర్యల్లో భాగమని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ తెలిపారు. ఏది ఏమైనా తాజా పరిణామాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగుల మెడ పైన కత్తిలా వేలాడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+