జెట్ వేగంతో బిలియనీర్లను సృష్టిస్తున్న ఏఐ..! సరికొత్త చరిత్ర..!

కృత్రిమ మేథ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయన్న ఆందోళనలు ఓవైపు ఉద్యోగుల్ని, తాజా గ్రాడ్యుయేట్లను వేధిస్తున్నాయి. అదే సమయంలో ఏఐ కారణంగా పుట్టుకొస్తున్న కొత్త ఉద్యోగాలకూ లోటు లేదు. అలాగే ఏఐ దూకుడుతో స్టార్టప్ లు సైతం కొత్త బిలియనీర్ల సృష్టిలో రికార్డు వేగంతో దూసుకుపోతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏఐలోనూ సానుకూల కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది కృత్రిమ మేథస్సును వాడుతున్న స్టార్టప్ కంపెనీలు సైతం డజన్ల కొద్దీ బిలియనీర్లను సృష్టించాయని నివేదికలు చెప్తున్నాయి. చరిత్రలోనే ఇదో పెద్ద సంచలనంగా చెప్పుకుంటున్నారు. ఆంత్రోపిక్, సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఏఐ, అనిస్పియర్, ఇతర స్టార్టప్‌ల కోసం ఈ సంవత్సరం భారీ ఎత్తున నిధుల సేకరణ జరిగింది. దీంతో ఆయా సంస్థల విలువ కూడా భారీ ఎత్తున పెరిగిపోయింది.

AI Startups Minting New Billionaires Faster Than Ever Before

సీబీ ఇన్ సైట్స్ ప్రకారం ఇప్పుడు 498 యూనికార్న్స్ లేదా బిలియన్ డాలర్, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేట్ ఏఐ సంస్థలు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. వీటి స్థూల విలువ 2.7 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. వీటిలో 100 కంపెనీలు 2023లో స్థాపించినవే. 100 మిలియన్ డాలర్లకు పైగా విలువలతో 1,300 కంటే ఎక్కువ ఏఐ స్టార్టప్‌లు ఉన్నాయని సంస్థ తాజాగా తెలిపింది.

ఎన్విడియా, మెటా, మైక్రోసాఫ్ట్, ఇతర ఏఐ ఆధారిత సంస్థల స్టాక్ ధరల పెరుగుదల, డేటా సెంటర్లు , కంప్యూటింగ్ శక్తిని నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల కంపెనీలు, ఏఐ ఇంజనీర్లకు భారీగా చెల్లింపులు చేస్తున్నాయి. తద్వారా ఏఐ వ్యక్తిగత సంపదను భారీగా పెంచేస్తోంది. 100 సంవత్సరాల వెనక్కి వెళ్లి డేటా చూస్తే ఈ పరిమాణం, వేగంతో సంపద సృష్టించబడటం ఎప్పుడూ జరలేదని ఎంఐటీలో పరిశోధకుడు ఆండ్రూ మెక్‌ఆఫీ చెప్తున్నారు. ఇదే అద్భుతమే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏఐ వల్ల సంస్థలతో పాటు వ్యక్తుల సంపద కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+