AI సదస్సులో ఏపీ 7 కీలక ఒప్పందాలు-పూర్తి వివరాలివే..!

ఏపీలో ఏఐ (AI), క్వాంటం వ్యవస్థల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఏడు కీలక ఒప్పందాలు చేసుకుంది. క్వాంటం-ఏఐ రంగంలో నైపుణ్య శిక్షణ-మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి.ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే వీటి లక్ష్యం.

ఏపీ ప్రభుత్వం తొలి ఒప్పందం (Ap govt mou)

క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఈ ఒప్పందం కుదిరింది. ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేలా ప్రణాళికల కోసం ఈ ఎంఓయూ చేసుకున్నారు.

AP Govt Signs 7 MoUs at AI Impact Summit to Establish State as Quantum-AI Hub

రెండో ఒప్పందం

క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఎంఓయూ చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ఐబీఎం శిక్షణ ఇస్తుంది. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించనుంది.

మూడో ఒప్పందం

ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌‌ను ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్లాన్ చేసింది. మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు ఇస్తుంది. భూమి, క్వాంటం హార్డ్‌వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ లో నేషనల్ హబ్ గా తీర్చిదిద్దేలా ఇందులో ప్లాన్ చేసారు.

నాలుగో ఒప్పందం

రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో భారత్ జెన్ సీఈఓ హృషీకేశ్ మోహల్ బాల్, ప్రతినిధి రామకృష్ణన్ లు నెక్స్ జెన్ సీఈఓ రాజగోపాల్, ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ పాల్గోన్నారు.

ఐదో ఒప్పందం

ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేలా ఎంఓయూ చేసుకున్నారు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఫోకస్ పెట్టేలా కాలిబో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఆరో ఒప్పందం

అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేలా వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేసేలా ఈ ఒప్పందం ఉంది. ఈ ఎంఓయూలో క్వాంటం సొల్యూషన్స్ హెడ్ వర్ధన్ సెహగల్, రాజ్ వట్టికూటి బృందం పాల్గొంది.

AP Govt Signs 7 MoUs at AI Impact Summit to Establish State as Quantum-AI Hub


ఏడో ఒప్పందం

ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామ కోటి, ప్రొఫెసర్ మితేష్ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+