చైనా సాధించింది గానీ..భారత్ కు ఆ ఆలోచనే తట్టలేదు సుమీ: సముద్ర దేవత పేరు మీద..!!

China: వాతావరణ విభాగంలో చైనా ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. ఓ సరికొత్త వెదర్ వార్నింగ్ సిస్టమ్ ను డెవలప్ చేసింది. దీనికి 'మాజు' అని పేరు పెట్టింది. ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేయడం దీని ప్రత్యేకత. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఈ AI టూల్ సహాయపడుతుంది.

మాజు అనేది- చైనా సముద్ర దేవత పేరు. షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్ లో ఈ వ్యవస్థను ఆవిష్కరించారు. 'మాజు' అనే పేరుకు చైనా తీర ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మాజును జాలర్లను రక్షించే సముద్ర దేవతగా భావిస్తారు చైనీయులు.

ఇప్పటికీ ఫుజియాన్, తైవాన్‌లో ఈ దేవతకు అనేక ఆలయాలు ఉన్నాయి. మాజు నమ్మకాలు, ఆచార వ్యవహారాలను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చిందంటే.. చైనా చరిత్రలో దీనికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో భాగంగా ఈ వెదర్ వార్నంగ్ సిస్టమ్ ను డెవలప్ చేసింది చైనా. 2013లో ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని 147 దేశాలను కలుపుతుంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మాజు సిస్టమ్ పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఉపయోగించుకోవచ్చు. వైపరీత్యాలు, అసాధారణ వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయగలదు. చైనా మెట్రోలాజికల్ అడ్మినిస్ట్రేషన్ (CMA)- ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇథియోపియా, పాకిస్తాన్ వంటి దేశాలతో కలిసి పనిచేస్తోంది.

భారత్ సహా అనేక దేశాల్లో బలమైన వాతావరణ వ్యవస్థలు ఉన్నాయి. భారత్ లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్, అమెరికాలో నేషనల్ వెదర్ సర్వీస్ వంటి శాఖలు ఉన్నాయి. శక్తిమంతమైన రాడార్లను ఉపయోగించి తుఫాన్లు, ముఖ్యంగా హరికేన్‌ల గురించి ఖచ్చితమైన సూచనలను అందిస్తున్నాయి.

జపాన్ భూకంపాలు, సునామీ హెచ్చరికలలో విషయంలో ముందంజలో ఉంది. కోపర్నికస్ ప్రోగ్రామ్, ఉపగ్రహాలను ఉపయోగించి పర్యావరణ మార్పులను ట్రాక్ చేస్తుంది. ఖచ్చితమైన వాతావరణాన్ని జపాన్ అంచనా వేయగలుగుతుంది. ఆయా వ్యవస్థలు ఎక్కువగా ఆయా దేశాలకు మాత్రమే పరిమితమౌతుంటాయి.

కొన్ని నిర్దుష్ట విపత్తులపైనే అవి దృష్టి పెడుతుంటాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. అంతేకాకుండా అవి స్థానిక సూపర్ కంప్యూటర్లపై ఆధారపడతాయి. మాజు వెదర్ వార్నింగ్ సిస్టమ్ మాత్రం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాతావరణ పరిస్థితులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పసిగట్టగలుగుతుందని వివరించింది.

భారత్ లో వాతావరణ అంచనాల కోసం ఇప్పుడిప్పుడే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పుడు మెరుగైన వర్షపాతం, తుఫాను అంచనాలు, వేడిగాలుల హెచ్చరికలు మరియు క్లౌడ్‌బరస్ట్ వంటి వైపరీత్యాలను అధ్యయనం చేయడానికి AIని ఉపయోగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+