టార్గెట్ ఫిక్స్, వైసీపీ కాపు నేతల కీలక నిర్ణయం- ఇక నేరుగా..!!
ఏపీలో 2029 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతోంది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలకు సిద్దం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలే కేంద్రంగా వైసీపీ కాపు రాజకీయంలో వ్యూహం ఫిక్స్ చేసింది. రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
వైసీపీ కొత్త సమీకరణాలకు తెర తీస్తోంది. గోదావరి జిల్లాల నుంచి కొత్త వ్యూహం అమలుకు సిద్దం అయింది. వెంకటాపురంలో వైసీపీ కాపు నేతల సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సామాజిక వర్గ కార్యక్రమాలపై నేతలు చర్చించారు. ఎవరినో అధికారంలో కూర్చోబెట్టడానికి మేము సమావేశాలు పెట్టుకోవటం లేదని స్పష్టం చేసారు. రూ.3 వేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని... వైసీపీ హయాంలో కాపు నేస్తం ఇచ్చామని గుర్తు చేసారు. అదే విధంగా ఈ భేటీలో పలు తీర్మానాలను ఆమోదించారు. కూటమి ప్రభుత్వం కాపులపై దాష్టీకాలకు పాల్పడుతోందని, దీనిపై పోరాడాలని వైసీపీ కాపు నేతలు నిర్ణయించారు. విజయవాడ కృష్ణలంకలో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ... రాష్ట్రంలో ఎక్కడైనా కాపులకు అన్యా యం జరిగితే... నేరుగా అక్కడికి వెళ్లి ధైర్యం చెప్పాలని తీర్మానించారు.

కీలక తీర్మానాలు
అందులో భాగంగా మూడు ప్రాంతాల్లో మూడు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాపు బాధితులకు క్లౌడ్ ఫండిం గ్ ద్వారా నిధులు సేకరించి ఆదుకోవాలని కూడా నిర్ణయించారు. భేటీకి హాజరైన నేతలంతా రూ.50వేలు తగ్గకుండా సేకరించి సాయికృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని తీర్మానించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభరెడ్డి కోలుకుని తమ పక్షాన తిరిగి పోరాడాలని ఆకాంక్షిస్తూ తీర్మానం చేశారు. విశాఖలో, తిరుపతిలోనూ ఇలాంటి సమావేశాలు పెట్టాలని తీర్మానించారు. ''ఈ సమావేశంపై మీడియాలో విభిన్న కథనాలు వచ్చా యి. ఇది ఒక వ్యక్తి కోసమో, ఒక సంఘటనను ఖండించడానికో పెట్టింది కాదు'' అని కన్నబాబు స్పష్టం చేసారు. ఇక.. కాపు నేతలు వరుస సమావేశాలు.. అమలు చేస్తున్న వ్యూహాలతో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications