తెలంగాణా పాత జ్ఞాపకాలతో జనసేనాని ఇంట్రెస్టింగ్ పోస్ట్... ఉద్దేశం ఇదేనా!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో జనసేనను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. తన పాత ఫోటోను పంచుకుంటూ తెలంగాణ ఉద్యమ కాలపు జ్ఞాపకాలను తాజాగా పంచుకోవటం కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణాపై దృష్టి పెట్టారు అన్న సంకేతాలను ఇస్తుంది.

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పోస్ట్

తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న ఫోటో తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఆలోచనలతో నిండిన రోజులను గుర్తు చేస్తుందని, బహుజన భావన, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారత కేంద్రంగా చర్చలు జరిగిన కాలాన్ని గుర్తు చేస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మేధావులు, బహుజన ఉద్యమకారుడు ఆగస్టిన్, విప్లవ గాయకుడు గద్దర్ తదితరులతో తన ఇంట్లో జరిగిన లోతైన చర్చలను గుర్తు చేసుకున్నారు.

Pawan Kalyan revives memories of Telangana Movement and Samajika Telangana through old photo

ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందు ఫోటో

పవన్, తన తండ్రి కొణిదల వెంకట్ రావు మరణించిన తర్వాత పీఆర్‌పీ రోజులకు ముందు ఈ ఫోటో తీయబడిందని వెల్లడించారు. ఆ ఫోటోలో అగస్టీన్, గద్దర్ తో మాట్లాడానని పేర్కొన్నారు. రాజకీయాలకు మించి సామాజిక మార్పు, సమానత్వం, రాజకీయ సాధికారత అనే ఆకాంక్షలు ఆ చర్చల్లో ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్వీట్ సామాజిక తెలంగాణ ఆశయానికి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చినట్టు చూపిస్తోంది.

జనసేన పార్టీ విస్తరణకు పవన్ బలమైన సంకేతాలు

ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణకు పవన్ బలమైన సంకేతాలు ఇస్తున్నారు. జూన్ 2, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ పునర్నిర్మాణ మిషన్ - జనసేన సడక్ సమ్మిట్ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

పాత ఆలోచనలను గుర్తు చేసి తెలంగాణలో క్రియాశీలక పాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేస్తున్న పవన్, "తెలంగాణ ఎవరి జాగీరు కాదు" అని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బహుజన ఆలోచన అనే తన పాత ఆలోచనలను గుర్తు చేసి తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన భావిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!
విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!

తెలంగాణపై పవన్ కళ్యాణ్ గట్టి ఫోకస్

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణపై గట్టి ఫోకస్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక తెలంగాణ ఆశయాన్ని రాజకీయంగా సాకారం చేయడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అనుచరులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మధ్య పవన్ ప్రజాదరణను రాజకీయ బలంగా మార్చే దిశగా జనసేన అడుగులు వేస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+