ఆధార్ ఉచిత సేవ.. జులై 1 నుండి ఆరునెలలపాటు.. త్వరపడండి

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుతో ఈమెయిల్ అడ్రస్ లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేయడం సేవను ఉచితం చేసింది. ఇప్పటి వరకు ఈ సేవకు రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉండేది. కానీ ఇకపై ఆరు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ తాజా నిర్ణయం జూలై 1, 2026నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమలులో ఉంటుంది.

ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మరో ఉచిత సేవ

ముఖ్యంగా ఈ ఉచిత సేవ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుందని UIDAI స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆధార్ సేవలు ఇంటి నుంచే సులభంగా పొందేందుకు UIDAI అనేక కొత్త సౌకర్యాలు అందిస్తోంది. గతంలో చిరునామా మార్పు, మొబైల్ నంబర్ అప్‌డేట్, ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ వంటి సేవల కోసం సేవా కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది.

Aadhaar Email update Aadhaar Card Email updation Free from july 1st only 6 months hurry up

కొత్తగా ప్రారంభించిన ఆధార్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ముఖ్యమైన సేవలు

ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ఆధార్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఎన్నో ముఖ్యమైన సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. ఈమెయిల్ అప్‌డేట్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈమెయిల్ లింక్ చేయడం వల్ల ఆధార్ సంబంధిత ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్‌డేట్స్ తదితర సమాచారం సకాలంలో మెయిల్ ద్వారా అందుతుంది.

ఈమెయిల్ ధ్రువీకరణ ఎలా చేయాలి?

మొబైల్‌లో ఆధార్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఆధార్ నంబర్ మరియు ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. Verify Email Address ఆప్షన్‌ను ఎంచుకుని వివరాలు నింపి ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 9.0 మరియు అంతకంటే ఎక్కువ, iOS వెర్షన్ 16.0 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది.

యాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఆధార్ సేవలు

యాప్ ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్, చిరునామా మార్పు, బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్, ఇ-ఆధార్ డౌన్‌లోడ్, కాంటాక్ట్ కార్డ్ జనరేట్ చేయడం, అభ్యర్థనల ట్రాకింగ్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. UIDAI ఈ చర్య ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ఆధార్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు
దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు

ఆరు నెలలలో ప్రజలు ఉచితంగా ఈమెయిల్ లింక్

ఇంతకుముందు mAadhaar స్థానంలో ప్రారంభించిన ఈ కొత్త ఆధార్ యాప్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తోంది. ఆరు నెలల కాలంలో ప్రజలు ఉచితంగా ఈమెయిల్ లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ తాజా సదుపాయం ఆధార్ సేవలను మరింత డిజిటల్‌గా మార్చడంలో మైలురాయిగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+