సువేందుకు మమత తొలి షాక్..! కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు..!

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బీజేపీని గెలిపించి అధికార పీఠం ఎక్కిన సువేందు అధికారికి (Suvendu Adhikari).. భవానీపూర్ లో ఆయన ప్రత్యర్థి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇప్పుడు షాకిచ్చారు. భవానీపూర్ లో అక్రమాలకు పాల్పడటం ద్వారా తనపై సువేందు విజయం సాధించారని ఆరోపిస్తూ మమత దాఖలు చేసిన పిటిషన్ ను కలకత్తా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో సీఎం సువేందుకు గత ఎన్నికల ఫలితాల తర్వాత తొలి ఎదురుదెబ్బ తగిలింది.

రెబెల్ ఎంపీలకు టీఎంసీ షాక్..! స్పీకర్ కు 20 అనర్హత పిటిషన్లు..!
రెబెల్ ఎంపీలకు టీఎంసీ షాక్..! స్పీకర్ కు 20 అనర్హత పిటిషన్లు..!

ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగిన మమతా బెనర్జీపై సువేందు అధికారి బీజేపీ అభ్యర్ధిగా పోటీకి వచ్చారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ సీటులో మమతను ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న సువేందు.. ఈసారి భవానీపూర్ లోనూ ఓడించి రికార్డు నెలకొల్పాలని భావించారు. అయితే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే భవానీపూర్ మమతా బెనర్జీకి సేఫ్ సీటు అని అంతా భావించారు. దీంతో ఈసారి భవానీపూర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా చివరి వరకూ సాగింది.

Mamata vs Suvendu Calcutta HC Admits Election Petition Orders Preservation of EVM VVPAT and CCTV Footage
సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ..!
సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ..!

అయితే మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం ఉన్నట్లు తేల్చేయడంతో అప్పటికే ఊపుమీదున్న బీజేపీ నేతలు భవానీపూర్ లోనూ ఓట్ల లెక్కింపు కేంద్రంపై దాడి చేసి, మమతా బెనర్జీపై పిడిగుద్దులు కురిపించారనే ఆరోపణలు వచ్చాయి. తద్వారా భవానీపూర్ లో ఫలితాన్ని సువేందుకు తనకు అనుకూలంగా మార్చుకుని, ఇక్కడి నుంచి 15 వేల తేడాతో గెలిచారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ లో సువేందు గెలుపును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అంతే కాదు భవానీపూర్ లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజ్ ను, ఈవీఎలు, వీవీ ప్యాట్లను సైతం భద్రపరచాలని ఈసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవానీపూర్ ఫలితంపై హైకోర్టు ఏం తేల్చబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+