ఈ రూట్లలో వందేభారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్- షెడ్యూల్, ముహూర్తం..!!

రైల్వే ప్రయాణీకులకు కీలక అప్డేట్. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ కు వస్తున్న ఆదరణతో కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రారంభించారు. రైల్వే శాఖ పలు ప్రధాన రైళ్లల్లో కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంది. అందులో తెలుగు రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. చాలా రోజులుగా ఏపీ, తెలంగాణ మీదుగా వందేభారత్ స్లీపర్ కేటాయించా లనే వినతుల మేరకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసేందుకు రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంది.

ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణతో వందేభారత్ స్లీపర్ సర్వీసులను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఆమోదం లభించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. చెన్నై, బెంగళూరు కు వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేయటంతో ప్రయాణీకులకు వెసులుబాటు కలిగింది. అదే విధంగా విశాఖ, తిరుపతికి నడుస్తున్న వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ స్లీపర్ రైలు పైన ఇప్పటికే రైల్వే మంత్రికి పలు వినతులు అందాయి. విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి చెన్నై, విజయవాడ నుంచి అయోధ్య కు కేటాయింపు పైన ప్రతిపాదనలు వచ్చాయి. కాగా, ఇప్పుడు కేటాయింపు పైన అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

 AP EAPCET Results 2026: ఫలితాల పై తాజా నిర్ణయం, ఆ రోజునే..!!
AP EAPCET Results 2026: ఫలితాల పై తాజా నిర్ణయం, ఆ రోజునే..!!
railways-plans-to-introduce-vande-bharat-sleeper-trains-on-9-key-routes-across-india-covering-major

తొమ్మది రూట్లలో నిర్వహణకు నిర్ణయం

కాగా, ఇప్పటికే హౌరా-గువహతి మధ్య తొలి స్లీప్ ట్రైన్ ప్రారంభమవ్వగా.. మరిన్ని స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్దం అవుతోంది. సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల ను అనుసంధానం చేసేలా రాత్రిపూట ప్రయాణికుల కోసం స్లీపర్ రైళ్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మార్గం కూడా క్లియర్ అయింది. అదే విధంగా న్యూఢిల్లీ-శ్రీనగర్, ముంబై-అహ్మదాబాద్ , న్యూఢిల్లీ-పుణె, న్యూఢిల్లీ-చెన్నై, న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-అహ్మదాబాద్, న్యూఢిల్లీ-ముంబై, ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించారు. రానున్న రెండు నెలల కాలంలో సికింద్రాబాద్ - ఢిల్లీ మధ్య వందేభారత్ స్లీపర్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ రూటులోనే ఈ రైలును కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే ముహూర్తం తో పాటుగా అధికారికంగా షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+