H1B Visa: 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు చెక్. ఇక సర్దుకోవాల్సిందేనా?

అమెరికాలో స్థిరపడి సొంత ఇల్లు, మంచి ఉద్యోగంతో హాయిగా జీవిస్తున్న భారతీయులతో సహా లక్షలాది మంది విదేశీ ఐటీ నిపుణుల నెత్తిన పిడుగు పడింది. హెచ్-1బీతో పాటు ఇతర తాత్కాలిక వర్క్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' నిబంధనను ఎత్తివేసేందుకు అగ్రరాజ్యం సిద్ధమవుతోంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉద్యోగం పోతే, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వీసా మారడానికి సమయం ఇవ్వకుండా.. తక్షణమే అమెరికా భూభాగాన్ని వదిలి వెళ్లాలనే కఠినమైన ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది.

60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు చెక్

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాలు ఉన్న ఉద్యోగులు ఊహించని విధంగా లేఆఫ్స్ గురైనా లేదా ఉద్యోగానికి రాజీనామా చేసినా, అమెరికా ప్రభుత్వం వారికి 60 రోజుల పాటు అక్కడే ఉండే వెసులుబాటు కల్పించేది.

US Proposes Removing 60-Day H1B Grace Period Tech Workers May Face Immediate Exit Upon Job Loss

ఈ రెండు నెలల వ్యవధిలో వారు మరో కంపెనీలో కొత్త ఉద్యోగాన్ని సాధించి తమ వీసాను బదిలీ చేసుకోవడానికి, లేదా వేరే వీసా కేటగిరీకి మారడానికి అవకాశం ఉండేది. అయితే, ఈ 60 రోజుల సమయాన్ని పూర్తిగా రద్దు చేసి, ఉద్యోగం పోయిన మరుక్షణమే అక్రమ వలసదారులుగా భావించేలా నూతన చట్టాన్ని తెచ్చేందుకు అగ్రరాజ్యం కసరత్తు చేస్తోంది.

H1B, F1 Visa: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఐసీఈ అటాక్.. భారతీయుల్లో ఆందోళన!
H1B, F1 Visa: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఐసీఈ అటాక్.. భారతీయుల్లో ఆందోళన!

పరిశీలన దశలోనే ప్రతిపాదిత నిబంధనలు

ఈ ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలు ప్రస్తుతం వైట్ హౌస్‌కు చెందిన ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ సమీక్ష పూర్తయిన తర్వాత, దీనిని సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం కోసం 'ఫెడరల్ రిజిస్టర్'లో ప్రచురిస్తారు. పబ్లిక్ కామెంట్స్ కోసం 30 నుంచి 60 రోజుల సమయం కేటాయించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నిబంధన గనుక పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రత్యేకంగా మినహాయింపు ఇస్తే తప్ప, మిగిలిన వారందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికాను వీడాల్సి వస్తుంది.

 H1B visa: నాలుగు కంపెనీలపై నిషేధం విధించిన అమెరికా..
H1B visa: నాలుగు కంపెనీలపై నిషేధం విధించిన అమెరికా..

భారతీయ ఐటీ రంగానికి తీరని దెబ్బ

అమెరికాలో ఇచ్చే హెచ్-1బీ వీసాల్లో సింహభాగం పొందుతున్నది మన భారతీయ టెక్కీలే కావడం గమనార్హం. గత కొద్దికాలంగా గ్లోబల్ టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆఫ్స్ వల్ల ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రేస్ పీరియడ్ సదుపాయం ఉండటంతో వారు మరో ఉద్యోగం వెతుక్కోగలుగుతున్నారు. ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా తీసివేస్తే, అప్పటికప్పుడు సామాన్లు సర్దుకుని స్వదేశానికి తిరిగొచ్చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ కమ్యూనిటీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+