యూపీఐ చెల్లింపులలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఏంటి? ఎవరు చెల్లించాలి?
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వీలుగా పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో కొన్ని సవరణలకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో యూపీఐ ట్రాన్సాక్షన్ ల పైన చార్జీలు విధిస్తారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అసలు ఇంత గందరగోళానికి కారణమైన చట్టంలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
ప్రభుత్వ సవరణ వెనుక రీజన్ ఇదే.. కానీ యూపీఐ చెల్లింపులపై ఛార్జీల ప్రచారం
ప్రభుత్వ విధానంలో భాగమైన ఈ సవరణ కేవలం భవిష్యత్తులో అవసరమైతే నిర్దిష్ట ఎలక్ట్రానిక్ లావాదేవీలపైన ముఖ్యంగా 2000 రూపాయలు దాటిన వ్యాపార చెల్లింపులపైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా చార్జీలు విధించేలా ప్రభుత్వానికి ఒక చట్టబద్ధమైన వెసులుబాటును కల్పిస్తుంది తప్ప నేరుగా సాధారణ కస్టమర్ల పైన ఎటువంటి భారాన్ని మోపదని తెలుస్తోంది. కానీ యూపీఐ చెల్లింపుల పైన వ్యక్తిగత వినియోగదారులకు కూడా చార్జీలు విధిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఏమిటి? దీనిని ఎవరు చెల్లించాల్సి ఉంటుంది?
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో యూపీఐ చెల్లింపుల పైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఈ సవరణ ద్వారా చట్టపరమైన అనుకూలత వస్తోంది.అయితే మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఏమిటి? దీనిని ఎవరు చెల్లించాల్సి ఉంటుంది? అనేది కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వినియోగదారులు చెల్లించాలా? లేక వినియోగదారులు చెల్లింపులు చేస్తున్న వ్యాపారులు చెల్లించాలా అన్న దానిపైన చర్చ జరుగుతుంది.
మర్చంట్ డిస్కౌంట్ రేట్ చెల్లించేది వీరే
అయితే మర్చంట్ డిస్కౌంట్ రేట్ అనేది వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించినందుకు వ్యాపారి బ్యాంకుకు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ కు చెల్లించే ఛార్జ్. ఇది సాధారణంగా కొద్ది శాతంలోనే ఉంటుంది. 2020 జనవరి నుండి రూపే, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులపైన ఈ ఎం డి ఆర్ ను రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు దీనిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.
ఆ వార్షిక టర్నోవర్ దాటితే 2000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైన ఎండీఆర్ చార్జీలు
అయితే 1.5కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, లగ్జరీ హోటల్స్ వంటి వాటిలో, 2000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపుల పైన ఎండీఆర్ చార్జీలు విధించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఇతర లావాదేవీలకు కూడా చార్జీలు వర్తింపజేస్తారనే భయాలు ప్రజలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. .



Click it and Unblock the Notifications