భార్య క్యారెక్టర్‌పై అనుమానంతో బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరా.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం రేపిన ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తన భార్య క్యారెక్టర్ పై తీవ్ర అనుమానం కలిగింది. ఆమె ఎవరితోనో వివాహేత సంబంధం నడుపుతోందేమోనని అనుమానంతలో ఆ న్యాయవాది భర్త.. నిజానిజాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యకు తెలియకుండా రహస్యంగా బెడ్రూంలోని లైట్ ఫిక్చర్ లో ఓ చిన్న సీక్రెట్ మినీ కెమెరాను అమర్చాడు.
సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసిన కేవలం 2 రోజులకే ఆ ఇంట్లో ఊహించని చోరీ జరిగింది. బీరువాలోని విలువైన ఆభరణాలు, బంగారం మాయమయ్యాయి. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో ఆ భార్య ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ.. "అయ్యో.. నా నగలన్నీ పోయాయి.. ఎవరో దొంగలు పడి నా బంగారు గొలుసు, నగలు దోచుకెళ్లారు" అంటూ హైడ్రామా సృష్టించింది.

సీసీటీవీ ఫుటేజ్ చూసి భర్త మైండ్ బ్లాంక్
భార్య అతి ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన భర్త.. తన బెడ్రూంలో సీక్రెట్ గా పెట్టిన కెమెరా రికార్డింగులను పరిశీలించాడు. తీరా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన భర్తకు మైండ్ బ్లాంక్ అయింది. అసలు దొంగ బయటి వ్యక్తులు ఎవరూ కాదు.. స్వయంగా తన భార్యేనని స్పష్టంగా తేలింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చేతులతో అల్మారా తెరిచి నగలన్నీ తీసి దాచడం ఆ సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది.
అసలు నిజం బయటపెట్టిన భార్య
వెంటనే ఆ లాయర్ పోలీసులను ఆశ్రయించి.. భార్య దొంగతనం చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను ఫిర్యాదుతో పాటు అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగ భార్యను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో ఆమె అసలు విషయాన్ని అంగీకరించింది. తన ప్రియుడికి అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో ఇంట్లోని ఆభరణాలన్నీ దొంగిలించి అతనికి ఇచ్చేసినట్లు విచారణలో వెల్లడించింది.
हाइड कैमरा लगाया किसी और घटना के लिए था उसमें हो गया कुछ और कैद 😃
— Arun Yadav (@ArunKosli) August 8, 2026
राजस्थान के जयपुर में एक वकील साहब को अपनी पत्नी के चरित्र पर शक था इसलिए उन्होंने एक मिनी होल्डर कैमरा खरीदा और अपने कमरे की लाइट में फिट कर दिया
भगवान की कृपा से कैमरा लगने के 2 दिन बाद ही घर में चोरी हो गई,,… pic.twitter.com/5S4Fy23tf9
ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ప్రియుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. భార్య వివాహేతర సంబంధంపై ఆధారాలు సేకరిద్దామని కెమెరా పెడితే దొంగతనంతో పాటు భార్య వేసిన కాలాంతక ప్లాన్ బయటపడి న్యాయవాదికి కావాల్సిన అన్ని ఆధారాలూ దొరికాయి.




Click it and Unblock the Notifications