ఏఐ మరో అద్భుతం- పెళ్లయిన 18 ఏళ్లకు గర్భం-ప్రపంచంలో తొలిసారి..!
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృత్రిమ మేథ (ఏఐ) వేగంగా దూసుకొచ్చేస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ వాడకం భారీ స్ధాయిలో ఉంది. ఏఐ వాడకంతో మనం ఎలా లబ్ది పొందగలమని ప్రతీ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం.. ఇలా ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరుగని అద్భుతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
సీఎన్ఎన్ కథనం ప్రకారం అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన గర్భ సాధన కేంద్రానికి ఓ జంట వచ్చింది. వీరు పెళ్లి అయి 18 ఏళ్లు అయినా ఇంకా పిల్లలు లేకపోవడంతో పలుమార్లు ఐపీఎఫ్ విధానంలో ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. దీంతో అత్యాధునిక గర్భధారణ పద్ధతుల్ని పరీక్షించేందుకు వారు కొలంబియా వర్శిటీ ఫెర్టిలిటీ సెంటర్ కు వచ్చారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు అజోస్పెర్మియా అనే అరుదైన సమస్య కారణంగా వీరి ఐపీఎఫ్ ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తించారు.

ఈ సమస్య కారణంగా పురుషుడి వీర్యంలో తగినంత స్పెర్మ్ ఉండదు. ఒక సాధారణ ఆరోగ్యకరమైన పురుషుడి వీర్య నమూనాలో మిల్లీలీటర్‌కు మిలియన్ల స్పెర్మ్ కణాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో పురుషులలో దాగి ఉన్న స్పెర్మ్‌ను గుర్తించడానికి ఏఏఐని ఉపయోగించే స్టార్ (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) పద్ధతిని ఉపయోగించి ఈ జంట సక్సెస్ అయ్యారు.
డాక్టర్లు ఏఐ ఆధారిత వ్యవస్థతో వీర్య నమూనాను పరిశీలించి, అతనిలో దాగి ఉన్న వీర్యాన్ని కనుగొనగలిగారు. వీర్యాన్ని తిరిగి పొందాక దానిని ఐపీఎఫ్ ద్వారా భార్య అండాన్ని ఫలదీకరణం చేయడానికి వాడారు. దీంతో ఇలా స్టార్ పద్ధతిని ఉపయోగించి గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications