మనుషులుండేది మూడేళ్లే.. గూగుల్ ఎక్స్ చీఫ్ వార్నింగ్!

ప్రస్తుతం మనం వాడుతున్న చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలు కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన తుఫాను ముందుంది అని గూగుల్ ఎక్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ మో గావ్డాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (AGI) వ్యవస్థలు రాబోతున్నాయని, దీనివల్ల ఊహించని స్థాయిలో ఉద్యోగాల నష్టాలు, ఆర్థిక అస్థిరత, భారీ సామాజిక మార్పులు వస్తాయని ఆయన హెచ్చరించారు. కానీ, దురదృష్టవశాత్తూ చాలా మంది ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇంకా సిద్ధంగా లేరని గావ్డాట్ అభిప్రాయపడ్డారు.

మనకు ఉన్నది కేవలం మూడేళ్లే!

AI తీసుకురాబోయే తదుపరి మహా విప్లవానికి సిద్ధం కావడానికి మానవాళికి కేవలం మూడేళ్ల సమయం మాత్రమే ఉందని గావ్డాట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం AI ఈమెయిల్‌లు రాయడం, ట్రావెల్ ప్లాన్ చేయడం లాంటి చిన్న పనులకే పరిమితమైనట్లు కనిపిస్తున్నా, పరిశోధనాశాలల్లో జరుగుతున్న ప్రయోగాలు చాలా భయంకరంగా ఉన్నాయన్నారు. 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' అనే పోడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. "నేను ఇప్పటికీ AGI 2027 నాటికి వస్తుందనే మాటకే కట్టుబడి ఉన్నాను" అని తేల్చి చెప్పారు. AI సిస్టమ్స్ తమ కోడ్‌ను తామే అసాధారణ వేగంతో మెరుగుపరుచుకుంటూ సరికొత్త సంస్కరణలను క్రియేట్ చేస్తున్నాయని, ల్యాబ్‌లలో నిపుణులు చూస్తున్నది అద్భుతమైన తెలివితేటలని ఆయన వివరించారు. అయితే నిజమైన ప్రమాదం AI వల్ల కాదు.. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు దానిని ఎలా వాడుకుంటాయనే దానిపైనే ఆధారపడి ఉందన్నారు.

Ex-Google Exec Mo Gawdat Warns Humanity Has Only 3 Years To Prepare For AGI Shift And Job Losses

వైట్-కాలర్ ఉద్యోగాలకే మొదటి దెబ్బ!

సాధారణంగా సాంకేతిక విప్లవం వస్తే శారీరక శ్రమ చేసే బ్లూ-కాలర్ ఉద్యోగాలు పోతాయని అనుకుంటారు, కానీ AI దెబ్బ మొదట కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే ఎంట్రీ-లెవల్ నాలెడ్జ్ వర్కర్లపై పడుతుందని గావ్డాట్ హెచ్చరించారు. కాల్ సెంటర్ ఏజెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌లు, ట్రావెల్ ఏజెంట్లు వంటి పనులు త్వరలోనే పూర్తిగా కనుమరుగవుతాయి. అలాగే పారా లీగల్స్, ఫైనాన్షియల్ ఎనలిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, కంపోజర్లు, మిడిల్ మేనేజర్‌లు, రోగ నిర్ధారణ చేసే డాక్టర్ల పని భారం కూడా గణనీయంగా తగ్గిపోతుంది.

18 నెలల్లో ఈ వైట్ కాలర్ జాబ్స్ అన్నీ..! మైక్రోసాఫ్ట్ ఏఐ ఛీఫ్ వార్నింగ్..!
18 నెలల్లో ఈ వైట్ కాలర్ జాబ్స్ అన్నీ..! మైక్రోసాఫ్ట్ ఏఐ ఛీఫ్ వార్నింగ్..!

గతంలో వంద మంది అవసరమైన పనిని ఇప్పుడు AI సాయంతో ఒక్కరే చేసేయవచ్చని, అందుకే కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం (హైరింగ్) నిలిపివేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇది నేరుగా ఉద్యోగం నుంచి తీసేయడం లాగా అనిపించకపోయినా, యువతకు కొత్త ఉద్యోగాలు రాకుండా కార్మికశక్తి పెరుగుదలను ఆపేస్తుందన్నారు. కోవిడ్ సమయంలో ఎలాగైతే అలర్ట్ అయ్యామో, ఇప్పుడు ఈ నిరుద్యోగ గండం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, లేదంటే తీవ్ర సామాజిక అశాంతి, ద్రవ్యోల్బణం తప్పవని హెచ్చరించారు.

రోబోల రూపంలో మానవీయ పనుల్లోకి..

వైట్-కాలర్ ఉద్యోగాల తర్వాత AI ప్రభావం రోబోటిక్స్ ద్వారా మానవీయ పనులపై పడనుందని గావ్డాట్ అంచనా వేశారు. ఇవి చూడటానికి మనుషుల రూపంలో ఉండకపోవచ్చు, కానీ స్వీయ-డ్రైవింగ్ కార్ల లాగే ప్రత్యేక యంత్రాల రూపంలో వచ్చి డ్రైవర్లు, సైనిక, లాజిస్టిక్స్, మరియు చట్టాన్ని అమలు చేసే పోలీసుల పనులను భర్తీ చేస్తాయన్నారు. శారీరక శ్రమతో కూడిన చెక్కపని (కార్పెంట్రీ) లాంటి నైపుణ్య వృత్తులు మాత్రమే రోబోలు అంత సులభంగా చేయలేవు కాబట్టి కొంతకాలం సురక్షితంగా ఉంటాయన్నారు.

Artificial Intelligence: మహిళా ఉద్యోగులకు శాపం, బలి అవుతుంది వీరే!
Artificial Intelligence: మహిళా ఉద్యోగులకు శాపం, బలి అవుతుంది వీరే!

యువతకు కీలక సలహా: AIతో పోటీ పడకండి!

ఇన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, AI యొక్క దీర్ఘకాలిక భవిష్యత్తుపై గావ్డాట్ ఆశాభావంతోనే ఉన్నారు. AI సాయంతో మానవజాతి ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లను పరిష్కరించవచ్చని, శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయవచ్చని ఆయన నమ్ముతున్నారు.

మరి ఈ AI యుగంలో యువత ఎలా మనుగడ సాగించాలి? దీనికి గావ్డాట్ ఒక చక్కని సలహా ఇస్తున్నారు: "AIతో పోటీ పడకండి, దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి". యంత్రాలు ఎప్పటికీ నకలు (కాపీ) చేయలేని కొన్ని ప్రత్యేక మానవ లక్షణాలు ఉన్నాయి. సానుభూతి, కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకత (క్రియేటివిటీ), మరియు నిజమైన మానవ సంబంధాలపై దృష్టి పెట్టాలని, రాబోయే రోజుల్లో ఇవే మనుషులను కాపాడే అతిపెద్ద ఆయుధాలు అని ఆయన యువతకు దిశానిర్దేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+