అంతరిక్షంలో సోలార్ పవర్ తో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం సమాజంలో ఒక అవసరంగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిపై పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో ఆల్ఫాబెట్ ముందుకు వచ్చింది. గూగుల్ తన డేటా సెంటర్ల నుండి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సౌరశక్తిని, అధునాతన సాఫ్ట్వేర్లను ఉపయోగించాలని నిర్ణయించింది.
సౌర విద్యుత్ తో అంతరిక్షంలో గూగుల్ ఏఐ సెంటర్
ఏఐ మోడల్స్ అభివృద్ధికి భారీగా విద్యుత్ అవసరం ఉంటుందని భావిస్తున్న google, విద్యుత్ అవసరం లేకుండా సౌర విద్యుత్ ను ఉపయోగించి ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది.ఇటీవల ఇదే విషయాన్ని google సీఈవో సుందర్ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు .అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదే ప్రస్తుత మా మూన్ షాట్ : సుందర్ పిచాయ్
ప్రాజెక్టు సన్ క్యాచర్ పేరుతో google త్వరలోనే ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సుందర్ పిచాయ్ గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణమని ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని తద్వారా సూర్యుడు నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేది ప్రస్తుత మా మూన్ షాట్ అని స్పష్టం చేశారు.
అంతరిక్ష డేటా సెంటర్లను ఏర్పాటుకు గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్ తో భాగస్వామ్యం
సూర్యుడు నుంచి లభించే అపార శక్తిని ఉపయోగించి స్పేస్ లో ఏ ఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటు లోని సమస్యలను పరిష్కరించాలని google లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.ఈ అంతరిక్ష డేటా సెంటర్లను ఏర్పాటుకు గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
స్పందించిన ఎలాన్ మస్క్
చిన్న యంత్రాల రాక్ లను, సాటిలైట్ లలోకి పంపించి పరీక్షిస్తామని, ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తామని సుందర్ పిచాయ్ వెల్లడించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2030 నాటికి గూగుల్ కార్బన్ రహిత శక్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే google ceo సుందర్ పిచాయ్ అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్ ఆ వీడియోను పోస్ట్ చేసి ఇంట్రెస్టింగ్ అంటూ ఒక్క పదంతో స్పందించారు.












Click it and Unblock the Notifications