AI ప్రతిజ్ఞల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. 24 గంటల్లో 2.5లక్షలు..!

దేశ రాజధాని దిల్లీ వేదికగా జరుగుతున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' లో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తామని కేవలం 2.5 లక్షలకు పైగా ప్రతిజ్ఞలను సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే అత్యధికంగా 2,50,946 మంది ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞలు చేశారు. దాంతో భారత్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.

ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా 2.50 లక్షల మందికిపైగా భారతీయులు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞలు చేయడంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఈ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత ప్రవీణ్ పటేల్ అధికారికంగా ధ్రువీకరించడం విశేషం. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.

Guinness World Record AI India Logs 250 946 AI Ethical Pledges in Just 24 Hours Historic Feat

ఫిబ్రవరి 16 నుండి 17 మధ్య కేవలం 24 గంటల వ్యవధిలో మొత్తం 2,50,946 ప్రతిజ్ఞలను భారత్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కేవలం సాంకేతికతగా మాత్రమే కాకుండా.. సమాజ శ్రేయస్సు కోసం, నైతికంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించేలా ప్రజలను చైతన్యపరచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+