తక్కువ సమయంలో ధనవంతులు అవ్వటం ఎలా? అదిరిపోయేలా చాట్ జీపీటీ రిప్లై!

ప్రస్తుత సమాజంలో చాలామంది బాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడానికి ఇష్టపడడం లేదు. స్మార్ట్ వర్క్, కాలర్ నలగకుండా చేసే పనులు చేయాలని, ఎక్కువ కష్టం లేకుండానే డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు. ఇక అటువంటి భావన ఉన్న చాలా మంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కూడా ఎదగొచ్చా అని ఆలోచిస్తున్నారు.

అనతి కాలంలో ధనవంతుడు అవడం ఎలా?
ఈ క్రమంలోనే అనతి కాలంలో ధనవంతుడు అవడం ఎలా అంటూ ఏఐ టూల్స్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విధమైన ప్రశ్నకు చాట్ జిపిటి అద్భుతమైన సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం చూసినవారి మైండ్ బ్లాంక్ అయిందంటే నమ్మండి.. ఇంతకీ చాట్ జిపిటి ఏం చెప్పిందంటే... తక్కువ కాలంలో డబ్బు సంపాదనకు ఉన్న మార్గాలను చెప్పడంతో పాటు, చివరిలో ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చింది.

How to become rich in a short time Chat GPT Reply to make your mind blank

Take a Poll

డబ్బు సంపాదనా మార్గాలు చెప్పిన చాట్ జీపీటీ
ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ లో ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, డేటా ఎనలిటిక్స్ వంటి స్కిల్స్ నేర్చుకోవాలని సూచించింది. చాట్ జిపిటి, కాన్వా, మిడ్ జర్నీ వంటి ఏఐ టూల్స్ పై పట్టు సాధించడం ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చని, ఇవి ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగపడతాయని చాట్ జిపిటి వెల్లడించింది.

కంటెంట్ క్రియేషన్ తో కూడా సంపాదన
యూట్యూబ్, instagram లలో కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా, డిజిటల్ ఉత్పత్తుల అమ్మకం ద్వారా, ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ చేయడం ద్వారా, బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఆదాయం సమకూరుతుందని, ఇక సిప్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ppf, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో కూడా లాభం ఉంటుందని పేర్కొంది.

పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళతో పరిచయాలు బెస్ట్
లింక్డ్ ఇన్ వంటి నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండడం వల్ల నిపుణుల నుండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, పాజిటివ్ మైండ్ సెట్ కలిగిన వాళ్లతో పరిచయాలను పెంచుకోవడం కూడా డబ్బు సంపాదనను ఈజీ చేస్తుందని చాట్ జిపిటి పేర్కొంది.

డబ్బు సంపాదనకు నో షార్ట్ కట్స్ అంటూ హితవు
ఇక ఇదే సమయంలో డబ్బు సంపాదించడానికి నో షార్ట్ కట్స్ అంటూ ధనవంతులు అవ్వాలనుకుంటే లాటరీలు, గ్యాంబ్లింగ్, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చూపించే పథకాల జోలికి వెళ్లొద్దని పేర్కొంది. ఇవి మీ జీవితాన్ని మరింత రిస్క్ లో పడేస్తాయి అని చాట్ జిపిటి చెప్పింది. ప్రస్తుతం చాట్ జిపిటి చెప్పిన ఈ సమాధానం అందరినీ ఆలోచించేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+