సెల్ఫీ తీసుకోండి చాలు ఏ వీడియోలో అయినా మీరే..! మెటా కొత్త ఏఐ టూల్ ..!
కృత్రిమ మేథ (artificial intelligence) ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. రోజుకో కొత్త టూల్, రోజుకో కొత్త ఏఐ టెక్నాలజీ ఇలా కేవలం నెలల వ్యవధిలోనే ఎన్నో మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు ఇదే క్రమంలో మరో కొత్త ఏఐ టూల్ ను మెటా పరిచయం చేస్తోంది. మెటా యూజర్లు కేవలం సెల్ఫీ తీసుకుని దాన్ని తమకు నచ్చిన వీడియోలో ఇన్ సర్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ కొత్త ఏఐ టూల్ కు ఈమూ వీడియోగా మెటా నామకరణం చేసింది.
మెటా యూజర్లు జస్ట్ సెల్ఫీ తీసుకుని టెక్స్ట్ ప్రాంప్ట్‌ను మాత్రమే ఉపయోగించి ఏఐ-జనరేటెడ్ వీడియో క్లిప్‌లలో తమను తాము ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈమూ వీడియో వీలు కల్పిస్తోంది. కంటెంట్ ను సొంతంగా తయారు చేయడం, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం, సోషల్ మీడియో ప్రమోషన్ పెద్ద సమస్యగా మారుతున్న రోజుల్లో యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా ఈ ప్రయత్నం చేస్తోంది.

సహజ రీతిలో సెల్ఫీ తీసుకుని దాన్ని మనకు నచ్చిన వీడియోలో కలిపి సరికొత్తగా మరో వీడియో తయారు చేసుకునేందుకు వీలుగా ఈమూ వీడియో ఆప్షన్ ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మెటా ఇంజనీరింగ్ బ్లాగ్ వెల్లడించింది. కేవలం సెల్పీ పిక్ తీసుకుని దాన్ని జనరేటివ్ ఏఐ ద్వారా మరో యానిమేషన్ వీడియో తయారు చేసుకుని ఈ రెండింటినీ మిక్స్ చేసి మరో కొత్త హైక్వాలిటీ వీడియోను సెకన్లలోనే జనరేట్ చేసేలా దీన్ని రూపొందించారు.
ఇందుకోసం ఎలాంటి అధునాతన సాంకేతిక నైపుణ్యాలు లేదా ఖరీదైన ఉత్పత్తి పరికరాల అవసరం ఉండదు. అయినా హైక్వాలిటీ కంటెంట్ వీడియోలు సెకన్లలోనే తయారయిపోతాయి. కంటెంట్ తయారు చేసే వారితో పాటు ఇన్ ఫ్లూయెన్సర్లు, డిజిటల్ మార్కెటీర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మెటా చెబుతోంది. అయితే దీని ద్వారా డీప్ ఫేక్ వీడియోలు కూడా తయారు చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ మెటా మాత్రం తమ ఈము వీడియోలో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications