మైక్రోసాఫ్ట్ టెక్కీలకు షాకుల మీద షాకులు- ఆ వింగ్ షట్ డౌన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న అమెరికా టెక్ దిగ్గజంమైక్రోసాఫ్ట్ మరో వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది 15,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత.. ఇప్పుడు తీసుకున్న ఈ తాజా చర్యలు టెక్కీలను మరింత ఆందోళనకు, గందరగోళానికి గురి చేస్తోన్నాయి. ఈ ఏడాది కూడా మరిన్ని లేఆఫ్‌లు ఉండొచ్చంటూ జరుగుతోన్న ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్టయింది.
తాజాగా టెక్కీల కోసం వార్తాపత్రికలు, లైబ్రరీ సబ్‌స్క్రిప్షన్లను మైక్రోసాఫ్ట్ రద్దు చేసింది. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లైబ్రరీ, న్యూస్ పేపర్ల వైపు మళ్లిస్తున్నట్లు రెడ్మండ్ కేంద్రంగా పనిచేసే ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా ఏఐపై దృష్టి సారిస్తోంది. సంస్థలో అన్ని డివిజన్లల్లో కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ వస్తోంది. దీనిపై గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ పెట్టుబడులను పెడుతోంది.

ఈ మార్పులో భాగంగా గత ఏడాది నవంబర్ లోనే మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అనేక పబ్లిషర్లకు ఆటోమేటెడ్ కాంట్రాక్ట్ రద్దు నోటిఫికేషన్లను పంపింది. న్యూస్ పేపర్లు, రిపోర్ట్ సేవలకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌లను నిలిపివేయడం ప్రారంభించింది. లైబ్రరీ స్టాఫ్ లో కూడా తాజాగా కోత పెట్టిందని, సబ్‌స్క్రిప్షన్లను నిలిపివేసిందని ది వెర్జ్ వెల్లడించింది. దీనిపై మైక్రోసాఫ్ట్ వెండర్ మేనేజ్‌మెంట్ టీమ్.. ఉద్యోగులకు ఓ ఇమెయిల్ కూడా పంపింది.
తన ప్రస్తుత ఒప్పందాల గడువు ముగిసిన తర్వాత వాటిని పునరుద్ధరించబోదని, ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తున్నామనేది ఈ ఇమెయిల్ సారాంశం. ఈ చర్య- అనేకమంది ఉద్యోగులలో ఆందోళనను రేకెత్తించింది. ఇందులో ముఖ్యమైనది స్ట్రాటజిక్ న్యూస్ సర్వీస్ తో మైక్రోసాఫ్ట్ తన సంబంధాన్ని తెంచుకోవడం. ఈ న్యూస్ సర్వీస్.. గత రెండు దశాబ్దాలుగా మైక్రోసాఫ్ట్‌లోని సుమారు 2,20,000 మంది ఉద్యోగులకు గ్లోబల్ రిపోర్ట్స్‌ను అందిస్తూ వస్తోంది.
మైక్రోసాఫ్ట్ వెండర్ మేనేజ్‌మెంట్ టీమ్ మెయిల్ అందిన టెక్కీలకు 'ది ఇన్ఫర్మేషన్' వంటి కొన్ని వ్యాపార ప్రచురణలకు డిజిటల్ యాక్సెస్ అందడం లేదు. అలాగే మైక్రోసాఫ్ట్ లైబ్రరీ నుండి వ్యాపార పుస్తకాలను తీసుకోవడం సాధ్యం కావడం లేదు. మైక్రోసాఫ్ట్ సాధారణంగా తన లైబ్రరీ సేవలను మార్పు చేస్తుంటుంది. ఈ పరిణామం- ఖర్చులను తగ్గించుకోవడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై మైక్రోసాఫ్ట్ ఎంతగా ఆధారపడుతోందనేది స్పష్టం చేసినట్టయింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications