లేఆఫ్స్ అసలు సమస్య ఏఐ కాదు-అదే..! ఆర్బీఐ మాజీ గవర్నర్ షాకింగ్..!

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాల కోతలకు కారణమైన కృత్రిమ మేథపై మన దేశంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. పలు దేశాల్లో ఆర్ధికవ్యవస్దలతో పోలిస్తే బలంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధ అన్ని సంక్షోభాల్ని తట్టుకుని నిలబడుతుంటే ఏఐ మాత్రం ఇక్కడి ఉద్యోగాల్ని ఇంత సలువుగా మింగేస్తున్న వైనంపై ఆర్ధిక వేత్తలు సైతం చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ దీనికి గల అసలు కారణం చెప్పారు.

ఏఐ కారణంగా ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేథ వల్ల చేతితో చేసే ఏ ఉద్యోగమూ పోదని రఘురాం రాజన్ వెల్లడించారు. అయితే మన దేశంలో విచ్చిన్నమైన విద్యా వ్యవస్ధ ఆ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్దితుల్లో ఉండదని ఆయన హెచ్చరించారు. దేశంలో శ్రామిక శక్తిని కాపాడుకునేందుకు అత్యవసర సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Raghuram Rajan s Warning Not AI But India s Broken Education System May Kill Hands-On Jobs

మన దేశం తక్కువ శిక్షణ పొందిన, చాలా సందర్భాలలో పోషకాహార లోపం ఉన్న శ్రామిక శక్తితో ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు పయనిస్తోందని కుశాల్ లోధాతో పాడ్‌కాస్ట్‌లో రాజన్ తెలిపారు. భారత్ తన యువతను పనికి ఎలా సిద్ధం చేస్తుందనే దానిపై జాతీయ స్ధాయిలో పునరాలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం విద్యా డిగ్రీలపై కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలపై స్పష్టమైన దృష్టితో దీన్ని ప్రారంభించాలన్నారు. ఏఐ యుగంలో ఇప్పటికీ ప్లంబర్ వంటి చేత్తో చేసే ఉద్యోగం మాత్రం పోకపోవచ్చని ఆయన తేల్చేశారు.

Raghuram Rajan s Warning Not AI But India s Broken Education System May Kill Hands-On Jobs

ప్లంబింగ్, ఎయిర్ క్రాప్ట్ ఇంజిన్ రిపేర్ వంటి పలు ఉద్యోగాలు ఆటోమేషన్ కు నిరోధంగా, పనికి ఉదాహరణగా ఉన్నాయని రఘురామ్ రాజన్ తెలిపారు. కానీ భారతదేశ ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ముఖ్యమైన ఉద్యోగాలకు అర్హత సాధించడానికి ప్రాథమిక నైపుణ్యాలైన గణితం, సైన్స్, కమ్యూనికేషన్ తో సన్నద్ధం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి దీనిపై దేశం దృష్టిసారించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+