AI తో తీర్పులు ఇవ్వొచ్చా? సుప్రీంకోర్టుకు కీలక ప్రతిపాదనలు ..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోకి చొచ్చుకువస్తున్న కృత్రిమ మేథ (AI) ఇప్పుడు న్యాయవ్యవస్ధలో కూడా ప్రభావం చూపుతోంది. కోర్టుల్లో విచారణలకు అవసరమైన పలు దస్త్రాల తయారీకి పలు చోట్ల ఏఐ వాడుతున్నారు. అయితే కోర్టు తీర్పుల్ని కూడా ఏఐ సాయంతో ఇచ్చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ తాజాగా మొదలైంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) నియమించిన కమిటీ సంచలన ప్రతిపాదనలు చేసింది.

న్యాయ నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం, పార్టీలు, సాక్షుల ప్రవర్తనను అంచనా వేయడానికి లేదా వారి ప్రొఫైల్‌లను రూపొందించడానికి AI టూల్స్ పై ఆంక్షలు, అలాగే న్యాయస్థాన ప్రక్రియలలో గోప్యంగా లేదా వివరించలేని ఏఐ వ్యవస్థలను ఉపయోగించడాన్ని నిషేధించడం వంటివి సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలలో ఉన్నాయి. న్యాయస్థానాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై ఈ ముసాయిదా మార్గదర్శకాలను వెలువరించింది.

Supreme Court Proposes AI Ban in Verdict and Bail Decisions- here is why

'న్యాయస్థానాలలో ఏఐ వినియోగం నిబంధనలు, 2026' ముసాయిదాలో, న్యాయస్థాన ప్రక్రియలలో AI వినియోగం ఎల్లప్పుడూ మానవ తీర్పుకు, న్యాయపరమైన అధికారానికి కచ్చితంగా లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు కమిటీ స్పష్టం చేసింది. ప్రతి ఏఐ వ్యవస్థ కేవలం సహాయక పాత్రలో మాత్రమే పనిచేస్తుందని, నియమానుసారం నియమించబడిన న్యాయాధికారి స్వతంత్ర న్యాయపరమైన అధికారాన్ని భర్తీ చేయదు లేదా రాజీపడదని తెలిపింది. చట్టం, వాస్తవం, న్యాయసంబంధిత విషయాలను నిర్ణయించే అంతిమ అధికారం సంబంధిత అధికార పరిధిలోని న్యాయాధికారులకే ప్రత్యేకంగా ఉంటుందని స్పష్టం చేసింది.

Supreme Court Proposes AI Ban in Verdict and Bail Decisions- here is why

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ అధ్యక్షతన, జస్టిస్‌లు సంజీవ్ సచ్‌దేవా, రాజా విజయరాఘవన్ వి, అనూప్ చిట్‌కారా, సూరజ్ గోవిందరాజ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, ఈ ముసాయిదా సిఫార్సులను ఖరారు చేయడానికి ముందు భాగస్వాములు, సాధారణ ప్రజల నుండి అభిప్రాయాలు, సూచనలను కోరింది. జూన్ 20 లోపు ఈ సూచనలను సమర్పించాలి. ఈ ముసాయిదా ప్రకారం, AI వినియోగాలకు అనుమతించబడిన విభాగాలు అనేకం ఉన్నాయి. కేసు నిర్వహణ, కారణాల జాబితా తయారీ, విచారణ సమయ నిర్ధారణ, కోర్టు విచారణల ట్రాన్స్‌క్రిప్షన్, తీర్పుల అనువాదం, న్యాయ పరిశోధన, కేసు దాఖలు సహాయం, లోపాలను పరిశీలించడం, రికార్డుల నిర్వహణ, న్యాయ వనరుల పంపిణీ వంటి పరిపాలనా విధుల కోసం వాడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+