పిల్లలే టార్గెట్ గా యూట్యూబ్ లో ఆ ఏఐ వీడియోలు..! షాకింగ్ రిపోర్ట్..!

ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్న కృత్రిమ మేథ దూకుడు కంపెనీల్ని, ఉద్యోగులనే కాదు యూట్యూబ్ వీక్షకుల్ని కూడా కలవరపెడుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఏఐ సాయంతో క్రియేటర్లు అప్ లోడ్ చేస్తున్న కంటెంట్ పై అభ్యంతరాలు పెరుగుతున్నాయి. తాజాగా వెల్లడైన ఓ రిపోర్ట్ ప్రకారం యూట్యూబ్ లో చిన్న పిల్లల్ని అలరించడమే లక్ష్యంగా ఏఐని వాడి నాసిరకపు వీడియోల్ని భారీ ఎత్తున అప్ లోడ్ చేస్తున్నట్లు తేలింది.

యూట్యూబ్ ఇప్పుడు నాణ్యమైన వీడియోలు అప్ లోడ్ చేస్తేనే డబ్బులిస్తామని క్రియేటర్లకు షరతులు పెడుతోంది. అయినా భారీ ఎత్తున ఏఐ కంటెంట్ ను అప్ లోడ్ చేయడం ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవచ్చని క్రియేటర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు చూసే వీడియోల్ని ఏఐ ద్వారా సృష్టించి భారీ ఎత్తున అప్ లోడ్ చేయడం ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు క్రియేటర్లు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు దారి తీస్తున్నాయి.

The AI Deception YouTube Creators Are Now Using Bots to Make Subpar Slop for Babies

బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ప్రకారం తక్కువ నాణ్యతతో కూడిన ఏఐ వీడియోలు చిన్న పిల్లల టార్గెట్ గా వెల్లువెత్తుతున్నట్లు తేలింది. ఇందులో ఎలాంటి నాణ్యత, వాస్తవికత కూడా ఉండటం లేదని నిర్ధారణ అయింది. ఈ రకమైన కంటెంట్‌లో ఏఐ స్వరాలతో కూడిన ఫోటోలు, వీడియోలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా 2 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి కోసం ప్రవేశపెట్టిన యూట్యూబ్ కిడ్స్ ను అంతకన్నాచిన్న పిల్లలు చూసేస్తున్నారు.

The AI Deception YouTube Creators Are Now Using Bots to Make Subpar Slop for Babies

ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక ప్రకారం శిశువులు, చిన్నపిల్లలు కూడా ఈ వీడియోల్ని చూస్తున్నారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులలో 60 శాతం కంటే ఎక్కువ మంది తమ బిడ్డ యూట్యూబ్ చూస్తారని చెబుతున్నారని ఈ నివేదిక తెలిపింది. దీంతో క్రియేటర్లు కూడా నాసిరకం ఏఐతో తయారు చేసిన వీడియోల్ని భారీ ఎత్తున అప్ లోడ్ చేస్తున్నట్లు తేలింది. అలాగే వీరు ఏఐ ద్వారా ఇలాంటి నాసిరకం వీడియోల్ని ఎలా భారీగా అప్ లోడ్ చేయొచ్చో కూడా అందులోనే చెప్పేస్తున్నారని నివేదిక వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+