సోషల్ యాప్స్ కు ఏఐ షాకులు..! ఇన్ స్టా ఛీఫ్ కీలక సూచనలు..!

ప్రస్తుతం ఇంటర్నెట్ ను, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను వీడియోలు ముంచెత్తుతున్నాయి. గతంలో పోలిస్తే పెరిగిన ఏఐ ప్రభావంతో తయారవుతున్న వీడియోలు అసలు వీడియోల ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా గతంలో కళ్లతో చూసిన దాన్ని నిజమని నమ్మే పరిస్ధితిని ఇప్పుడు అస్సలు లేకుండా చేసేస్తున్నాయి. దీంతో ఏది అసలు వీడియోనో, ఏదో ఏఐతో తయారైన వీడియోనో గుర్తించలేని పరిస్ధితులు ఎదురవుతున్నాయి.ఈ సమస్యపై ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడం మొస్సేరీ స్పందించారు.

మన జీవితాల్లో ఎక్కువ భాగం, మనం చూసేది నిజమని నమ్ముతున్నామని, కానీ AI రాకతో అది మారబోతోందని, దానికి అనుగుణంగా మనుషులు మారడానికి సంవత్సరాలు పడుతుందని మోస్సేరి వెల్లడించారు. కాలక్రమేణా మనం చూసేది నిజమని డిఫాల్ట్‌గా భావించడం నుండి, మీడియాను చూసినప్పుడు సందేహంతో ప్రారంభించి, ఎవరు ఏదైనా షేర్ చేస్తున్నారు, అలాగే వారు దానిని ఎందుకు షేర్ చేస్తున్నారనే దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతామని స్పష్టం చేశారు.

generate pic of insta AI videos threat

ప్రస్తుతం కనిపిస్తున్న సోషల్ వీడియోలు యూజర్లతో కనెక్ట్ కావడమే లక్ష్యంగా తయారు చేస్తున్నారని, ఇది డీప్ ఫేక్ లు, ఏఐ ఫొటోలు, వీడియోల పెరుగుదలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పలేని పరిస్దితి ఉందని తెలిపారు. కానీ సదరు వీడియోల క్రియేటర్లు టెక్నాలజీ వాడినా, వాడకపోయినా క్రెడిబులిటీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ సమయంలో మనం ఏమి చెబుతున్నామో కాకుండా ఎవరు చెబుతారు అనే దానిపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.

generate pic of insta AI videos threat

ఇలాంటి పరిస్ధితుల్లో ఏఐ కంటెంట్ ను గుర్తించి లేబుల్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపైనా ఒత్తిడి పెరుగుతోందన్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు ఏఐ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇది మరింత కష్టంగా మారుతుందన్నారు. నకిలీ మీడియా కంటే నిజమైన మీడియాను గుర్తించి నమ్మే వారి సంఖ్య ఇప్పటికే పెరుగుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+