AIతో మ్యాథ్స్ శుద్ధ దండగ..! తేల్చేసిన గణిత శాస్త్రవేత..!

కృత్రిమ మేథ రాకతో ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ ఏఐ ప్లాట్ ఫామ్స్ కు తోడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)లు కూడా దూసుకొస్తున్నాయి. వీటిని వాడుకుని మరింత లోతుగా సెర్చ్, విశ్లేషణలు చేయొచ్చనే చర్చ అనేక దేశాల్లో సాగుతోంది. దీంతో ఎల్ఎల్ఎంలను వాడుకునేందుకు విద్యార్ధులు, పరిశోధకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఎల్ఎల్ఎంలు గణిత శాస్త్రం విషయంలో ఏమాత్రం ఉపయోగపడటం లేదని, ఇంకా చెప్పాలంటే శుద్ధ దండగని అమెరికాలోని నోట్రేడామ్ యూనివర్శిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్, గణిత మేథావిగా పేరున్న జోయల్ డేవిడ్ తేల్చేశారు.

ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా లెక్కల్ని సులువుగా అర్ధం చేసుకోవచ్చన్న భావన తప్పని నోట్రే డేమ్ విశ్వవిద్యాలయంలో లాజిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రముఖ గణితశాస్త్రవేత్త జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ తేల్చిచెప్పేశారు. ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ను గణిత పరిశోధనలో పూర్తిగా అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ మోడల్స్ తప్పుడు సమాధానాలు ఇచ్చి, సరిదిద్దినప్పుడు కూడా బాగుందంటూ చెప్పుకుంటున్నాయని విమర్శించారు.

Top Mathematician Joel Hamkins Slams AI Zero Help for Real Math Research

లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తన గణిత పనిలో ఏ విధంగానూ సాయపడటం లేదని హాప్కిన్స్ తెలిపారు. అనేక పెయిడ్ స్క్రిప్ట్ లతో ప్రయోగాలు చేసినా ఉపయోగం లేదన్నారు. తప్పులు చూపించినప్పుడు AIలు మానవుల్లా వాదిస్తాయని, ఇది ఇరువైపులా ఉండాల్సిన సహకార సంబంధాన్ని నాశనం చేస్తుందని హామ్కిన్స్ పేర్కొన్నారు. మనుషులు ఇలాగే చేస్తే మనం వారిని దూరం పెట్టేస్తామని ఆయన గుర్తుచేశారు.

Top Mathematician Joel Hamkins Slams AI Zero Help for Real Math Research

ఎర్డోస్ సమస్యల్లో AI సహాయంతో కొందరు మేథావులు పురోగతి సాధించారు కానీ, టెరెన్స్ టావో వంటి వారు AI ప్రూఫ్‌లలో దాగి ఉన్న తప్పులపై హెచ్చరికలు చేశారు. బెంచ్‌మార్క్ పరీక్షల్లో బాగా చేసినా, రియల్ రీసెర్చ్‌లో ఇది విశ్వసనీయం కాదని హామ్కిన్స్ నిర్ధారించారు. దీంతో ఇకపై మ్యాథ్స్ విషయంలో ఎల్ఎల్ఎంలను నమ్ముకుంటే ఉపయోగం లేదని తేలిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+