10 అడుగుల దూరంలో నిలబడి మీ ఫోన్ కాల్ హ్యాక్..! కొత్త ఏఐ టూల్..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథపై పరిశోధనలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా జరుగుతున్నాయి. అతి తక్కువ సమయంలో ఏఐ సాయంతో చేయగల పనులపై ఇప్పుడు ప్రతీ దేశం పరిశోధనలు చేస్తోంది. వీటిలో ఎలాగో ముందున్న అమెరికా తాజాగా ఓ ఏఐ టూల్ ను అభివృద్ధి చేసింది. దీని సాయంతో ఇప్పుడు కేవలం 10 అడుగు దూరంలో నిలబడి ఇతరుల ఫోన్ కాల్స్ ను హ్యాక్ చేసే అవకాశం ఉందని చెబుతోంది.
అమెరికాలోని పెన్ రాష్ట్రంలో ఉన్న పరిశోధకులు ఏఐ వల్ల తలెత్తే మరో ముప్పును కనిపెట్టారు. ఎన్నో అడుగుల దూరంలో ఉండి కూడా ఫోన్ కాల్‌లను వినగల ఏఐ ఆధారిత వ్యవస్థను వారు కనుగొన్నారు. దీంతో ఇప్పుడు గోప్యతకు సంబంధించిన ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. కేవలం 10 అడుగుల దూరంలో నిలబడి రాడార్, ఫోన్ వైబ్రేషన్స్ సాయంతో కాల్స్ ను హ్యాక్ చేసే అవకాశం కలిగిన టూల్ ను వారు అభివృద్ధి చేశారు. దీంతో ఏఐ ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా మారుతుందో అన్న చర్చ జరుగుతోంది.

వైర్‌లెస్ , మొబైల్ నెట్‌వర్క్‌లలో భద్రత , గోప్యతపై జరిగిన ఓ సదస్సులో దీన్ని పరిశోధకులు నిరూపించారు. కృత్రిమ మేధస్సు , రాడార్ టెక్నాలజీని ఉపయోగించి ప్రైవేట్ ఫోన్ సంభాషణలను ఆ పరికరాన్ని తాకకుండా ఎలా హ్యాక్ చేశారో వివరించారు. వైర్‌లెస్-ట్యాపింగ్ అని పిలిచే ఒక వ్యవస్థను వీరు పరీక్షించారు. ఇది స్మార్ట్‌ఫోన్ ఇయర్‌పీస్ ద్వారా ఉత్పన్నమయ్యే చిన్న వైబ్రేషన్‌లను కొలవడం ద్వారా ఫోన్ సంభాషణలను 10 అడుగుల దూరం నుండి పాక్షికంగా నమోదు చేయవచ్చని తేల్చింది.
కాల్-ట్యాపింగ్ టెక్నాలజీ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ 10 వేల పదాల వరకు ఉపయోగించినప్పుడు ట్రాన్స్‌క్రిప్ట్‌లను దాదాపు 60 శాతం ఖచ్చితత్వంతో పునర్నిర్మించవచ్చని వీరి ప్రయోగం నిరూపించింది. మనం ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా, కాలర్ వాయిస్ ఇయర్‌పీస్ స్పీకర్ ద్వారా ప్లే అవుతుంది. ఇది ఫోన్ పైన చిన్న వైబ్రేషన్స్ తెస్తుంది. సాధారణంగా ఈ వైబ్రేషన్స్ గుర్తించబడవు. కానీ ఈ ప్రయోగంలో పరిశోధకులు ఈ వైబ్రేషన్స్ ను వాడి కాల్‌ను అర్థంచేసుకోగలిగారు. మెషిన్ లెర్నింగ్‌ను తీసుకువస్తే మొత్తం సంభాషణలను గుర్తించగలమని వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications