Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బతుకమ్మపండుగ, తెలంగాణా సాంస్కృతిక చిహ్నం .. తొమ్మిది రోజుల పూల సంబరం; విశిష్టత ఇదే!!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ.

 తొమ్మిది రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ

తొమ్మిది రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ

ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ, అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు.

బతుకమ్మ పూలకు ప్రత్యేకతలెన్నో

బతుకమ్మ పూలకు ప్రత్యేకతలెన్నో

బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోక బంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయాలలో, వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలుపంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటా

 తొమ్మిదిరోజుల బతుకమ్మ వేడుకలు .. నైవేద్యాలు

తొమ్మిదిరోజుల బతుకమ్మ వేడుకలు .. నైవేద్యాలు

ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లం తో నైవేద్యం తయారు చేసే అమ్మవారికి నివేదిస్తారు. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం ,పాలు కలిపి నైవేద్యం తయారుచేసి అమ్మవారికి నివేదించి వేడుక చేసుకుంటారు. ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలను పెట్టి పూజిస్తారు. ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు. ఆరోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లలా బియ్యంపిండిని చుట్టి, వాటిని బాగా వేయించి, వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేసి అమ్మవారికి నివేదిస్తారు.తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మ ను జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు,అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రక రకాల తృణధాన్యాలను వినియోగిస్తారు.

 బతుకమ్మను పేర్చే విధానం.. మహిళల ఆట .. నిమజ్జనం

బతుకమ్మను పేర్చే విధానం.. మహిళల ఆట .. నిమజ్జనం

రాగిపళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూల కట్టలు పేర్చి, మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ ఫుల్ గా బతుకమ్మను పేరుస్తారు.ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులతో చక్కగా బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపై పసుపు తో గౌరమ్మను తయారుచేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. సాయంత్ర సమయంలో అందరూ తమ బతుకమ్మలను తీసుకుని, ఒక్క చోట చేరి ఆడి పాడి ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మహిళలు ఒకరికొకరు పంచుకుంటారు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ పళ్లెంలో తెచ్చిన నీళ్లతో వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. లక్షలాదిగా మహిళలు పట్టు చీరలు కట్టుకొని, పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్క చోట చేరి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు.

Recommended Video

    #Telangana : Hyderabad Metro Announces Festival Offers To Passengers || Oneindia Telugu
     ఆచారాలు, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు

    ఆచారాలు, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు

    ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ, కోసలాదేశుండు నుండి ఉయ్యాలో దశరధ రాముండు ఉయ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుండి జాలువారుతాయి. ఇంత చక్కని, అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన, అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పటం తెలంగాణాకే గర్వకారణం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+