చిరంజీవితో సినిమా చేయడం ఒక పీడకల: స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో కొందరు కథానాయికలు తక్కువ సినిమాలే చేసినప్పటికీ, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే ఒకరు. మహేష్ బాబు సరసన 'మురారి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనాలి.. ఇక్కడ చేసినవి కేవలం ఆరు సినిమాలే. కానీ, ఆ ఆరింటిలో ఐదు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్లాక్‌బస్టర్లే కావడం విశేషం. 'మురారి', 'ఇంద్ర', 'మన్మథుడు', 'ఖడ్గం', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' వంటి ఇండస్ట్రీ హిట్లలో భాగమైన సోనాలికి.. బాలకృష్ణతో చేసిన 'పలనాటి బ్రహ్మనాయుడు' రూపంలో ఒక్క డిజాస్టర్ మాత్రమే ఎదురైంది.

నా కెరీర్ లో మైలురాయి

అయితే, ఇంతటి క్రేజీ సక్సెస్ రేట్ ఉన్న ఈ సీనియర్ నటి.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నటించడం తనకు ఒక 'పీడకల' అంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి, సోనాలి బింద్రే కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంద్ర', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. కానీ, ఒక ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ.. "ఇంద్ర సినిమా నా కెరీర్‌లో ఒక మైలురాయి, కానీ ఆ చిత్ర షూటింగ్ రోజులు నాకొక పీడకల లాంటివి" అని బాంబు పేల్చింది.

Chiranjeevi movie was a nightmare to work on says star heroine in sensational remarks

అయితే ఆమె ఈ మాటలు అన్నది నెగెటివ్ ఉద్దేశంతో కాదు.. మెగాస్టార్‌తో డ్యాన్స్ చేయలేక పడ్డ టెన్షన్ గురించి! "చిరంజీవి గారితో కలిసి సాంగ్ షూటింగ్ ఉందంటే చాలు.. దానికి ముందు రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు. ఆయనతో సమానంగా డ్యాన్స్ చేయడం ఏ హీరోయిన్‌కైనా చాలా కష్టం. ఆయన బాడీ లాంగ్వేజ్, గ్రేస్ అందుకోవడం మామూలు విషయం కాదు." అని సోనాలి నవ్వుతూ చెప్పుకొచ్చింది.

ఆ 'వీణ స్టెప్' చూసి కళ్ళు తిరిగాయి!

'ఇంద్ర' సినిమాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచిన 'దాయి దాయి దామ్మా' సాంగ్ షూటింగ్ సమయాన్ని సోనాలి గుర్తుచేసుకుంది. "సెట్స్‌లోకి వెళ్లాక చిరంజీవి గారు వేసిన ఆ ఐకానిక్ 'వీణ స్టెప్' చూసి నా కళ్ళు తిరిగాయి. బాబోయ్.. ఈ స్టెప్ నేను కూడా వేయాలా? అని టెన్షన్‌తో మాస్టర్‌ని అడిగాను. లేదు, ఇది కేవలం చిరంజీవి గారు మాత్రమే వేస్తారు.. మీరు నార్మల్ స్టెప్స్ వేస్తే చాలు అని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను" అంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంది.

అదేవిధంగా 'రాధే గోవిందా' పాట చిత్రీకరణ విశేషాలను చెప్తూ.. హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి ఆ పాటను షూట్ చేశారని, ఆ సమయంలో చిరంజీవి గారిని, ఆయన డ్యాన్స్‌ను చూడటానికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు (రామ్ చరణ్ తదితరులు) అందరూ సెట్స్‌కు వచ్చేవారని సోనాలి తెలిపింది. మెగాస్టార్‌తో డ్యాన్స్ చేయడం పీడకల లాంటి టెన్షన్ ఇచ్చినప్పటికీ.. 'మురారి' సినిమా ద్వారా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం, చిరు వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి అని సోనాలి బింద్రే ఇంటర్వ్యూ ముగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+