శ్రీహరి తనయుడు హీరోగా సాలిడ్ థ్రిల్లర్- టీజర్ విడుదల
టాలీవుడ్ లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరపలేని ముద్ర వేసుకున్నాడు.. దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన కన్నుమూసి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆయనను గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు అలాంటివి. మగధీర, కింగ్, బృందావనం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మహానంది, ఒక్కడే, భద్రాచలం.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. వాటి విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు శ్రీహరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మేఘాంశ్ శ్రీహరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆస్మాన్. నేడు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆస్మాన్ టీజర్ విడుదల అయింది. కాంబోడియాలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిందీ మిస్టిక్ థ్రిల్లర్. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా టీజర్ ను కట్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ కు మరో ప్రామిసింగ్ హీరో దొరికాడనిపించేలా మాస్ లుక్ లో కనిపించాడు మేఘాన్ష్ ఇందులో. శ్రీక్లింకారా సెల్యూలాయిడ్స్ బ్యానర్ పై ఈ ఫిల్మ్ తెరకెక్కింది. ప్రశాంత్ ఆర్ విహారీ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. షోయబ్.. డీఓపీగా వ్యవహరించాడు. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ సినిమాకు నిర్మాతలు. రామ్ నందన్ దర్శకత్వం వహించారు. ఆయనే కథను కూడా ఆయనే సమకూర్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు అరబిక్ భాషలో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.
సినీ ప్రయాణంలో తండ్రి లెగసీని కొనసాగించడానికి మేఘాంశ్ శారీరకంగా కష్టపడ్డాడు. 13 ఏళ్ల వయసులో అధిక బరువుతో సతమతం అయ్యాడు. నటుడు కావాలనే సంకల్పంతో బరువు తగ్గాడు. బాక్సింగ్ పై అతనికి మంచి గ్రిప్ ఉంది. తండ్రి శ్రీహరి పేరు దెబ్బతినకుండా ఉండడానికి సెలెక్టివ్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని అవకాశాలను సైతం తిరస్కరించాడు. ఆస్మాన్ తో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు.
The hunt has officially begun!
— SZN (@Suzenbabu) September 16, 2026
Dive into the raw, ruthless, and fierce world of #Aasmaan.
#AasmaanTeaser is OUT NOW
▶️ https://t.co/4We7l6pRd6@MeghamshSrihari @rayancha2vk @theramnandhan @kondaruvenkates #MannemSrikanth #SwapnaKondaru @prashanthvihari @ShoiabAhamed…













Click it and Unblock the Notifications
