రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ సర్ ప్రైజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పించాయి. వృద్ధి సినిమాస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

జూన్ 4వ తేదీన విడుదల కాబోతోన్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిరాశ పరిచిన నేపథ్యంలో దీనిపై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే విడుదలైన పాటలు గానీ, ట్రైలర్ కు గానీ అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. స్పోర్ట్స్ పర్సన్ గా రామ్ చరణ్ కనిపించడం అదనపు ఆకర్షణ.

Hellallallo Promo Out Now From the Ramcharan Upcoming Movie Peddi and Full Song Launch on May 23

ఈ సినిమా నుండి 'హెల్లల్లొ' అనే ప్రత్యేక గీతం ప్రొమో తాజాగా విడుదల అయింది. రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన సాంగ్ ఇది. దీనికి సంబంధించిన ఓ చిన్న ప్రొమో క్లిప్ విడుదల అయిన వెంటనే వైరల్ అయింది. 24 సెకెన్ల నిడివి ఉన్న ఈ పాట ప్రోమోలో మెస్మరైజింగ్ స్టెప్స్ తో అదరగొట్టారు రామ్ చరణ్, శృతి హాసన్. ఇక ఫుల్ సాంగ్ శనివారం భోపాల్ లో విడుదల కానుంది. ఈ ప్రోమో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.

గ్రామీణ నేపథ్యంలో సాగే 'పెద్ది'లో కుస్తీ, క్రికెట్ వంటి క్రీడా అంశాలతో పాటు, భావోద్వేగ డ్రామాలతో తెరకెక్కింది. ఓ ఫుల్ ప్లెడ్జ్డ్ స్పోర్స్ట్ మెన్ గా రామ్ చరణ్ నటించడం ఇదే మొదటిసారి. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మల్టీ డైమెన్షనల్ క్రీడాకారుడిగా అద్భుతమైన పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా అచ్చియమ్మ అనే రూరల్ బ్యాక్ గ్రౌండ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన రెండవ సింగిల్ "రై రై రా రా" అదరగొట్టింది. రామ్ చరణ్ హై-ఎనర్జీ కొరియోగ్రఫీ, ఏఆర్ రెహ్మాన్ గాత్రంతో తెలుగు, తమిళ భాషల్లో ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+