ఐబొమ్మ ఇక కనిపించదు ..క్లోజ్

ఒకప్పుడు సినిమా ప్రేక్షకులకు 'ఉచిత వినోదం' అందిస్తూ, ఓటీటీ సంస్థలకు, చిత్ర పరిశ్రమకు సవాలు విసిరిన అతిపెద్ద పైరసీ సామ్రాజ్యం 'ఐబొమ్మ'. ఇంటర్నెట్ లోకం నుంచి దాన్ని చేధించడం అసాధ్యం అనుకున్నారంతా. 'దమ్ముంటే పట్టుకోండి' అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు. కానీ, తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆ సవాల్‌ను స్వీకరించి, కరేబియన్ దీవుల్లో దాగి ఉన్న ఆ పైరసీ సామ్రాజ్యానికి తాళం వేయించారు.

సంచలనాత్మక పైరసీ వెబ్‌సైట్లుగా పేరుగాంచిన ఐబొమ్మ (iBomma) , బప్పం టీవీ (Bappam TV) లపై తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ వెబ్‌సైట్‌ల నిర్వాహకుడు, ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేసి, అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

iBomma Shut Down Telangana Cybercrime Arrests Piracy Website Admin Ippadi Ravi After Open Challenge

ఐబొమ్మ వెబ్‌సైట్‌ను కరేబియన్ దీవుల నుంచి నిర్వహిస్తున్న రవి, ఈ వెబ్‌సైట్‌లో కేవలం పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంచేవాడు. దీని ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గతంలో సోషల్ మీడియా వేదికగా పోలీసులకు, సినీ పరిశ్రమకు నేరుగా సవాలు విసిరాడు. మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ అతి ధైర్యాన్ని ప్రదర్శించాడు.

ఆ సవాల్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రవిని అరెస్టు చేసిన తరువాత, అతనితోనే వెబ్‌సైట్‌లను శాశ్వతంగా మూసివేయించడం జరిగింది. రవి వద్ద స్వాధీనం చేసుకున్న లాగిన్స్ ,సర్వర్ వివరాలను ఉపయోగించి ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను పోలీసులు అధికారికంగా క్లోజ్ చేయించారు.

పోలీసులు ఇమ్మడి రవి నుంచి వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డిస్క్‌లలోని సమాచారాన్ని ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారు, ఆర్ధిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, ఇమ్మడి రవిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఐబొమ్మ వ్యవస్థాపకుడి అరెస్టు, వెబ్‌సైట్ మూసివేత తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది. సైబర్‌క్రైమ్ పోలీసులు తమ దర్యాప్తు సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+