నన్ను బలిపశువును చేస్తున్నారు!
ట్రోలర్లకు తనదైన శైలిలో చురకలు అంటిస్తూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఎంత ఉంటాయో, తెర వెనుక ట్రోల్స్ రూపంలో వచ్చే చీకటి కూడా అంతే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కేవలం తనపై వచ్చే విమర్శలనే కాకుండా, తన అన్న అర్జున్ కపూర్ ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్ ఇష్యూస్‌పై కూడా ఆమె గట్టిగా గళం విప్పారు.
సోషల్ మీడియా నెగెటివిటీని జాన్వీ ఒక బిజినెస్ స్ట్రాటజీగా అభివర్ణించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ వ్యూస్, లైక్స్, క్లిక్స్ కావాలని.. అందుకోసం సెలబ్రిటీల పేర్లను వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మనం చేసే పని కంటే, మనల్ని విమర్శిస్తేనే వారికి ఎక్కువ అటెన్షన్ వస్తుంది. మనల్ని కేవలం ఒక బలిపశువులా వాడుకుని వారి పేజీలకు ట్రాఫిక్ పెంచుకుంటారు. ఈ నిజాన్ని గ్రహించిన రోజున, ఆ కామెంట్స్ మన గురించి కాదని, వారి బిజినెస్ కోసమని అర్థమైపోతుంది.అందుకే అటెన్షన్ కోసం చేసే ఇటువంటి కామెంట్స్ గురించి ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలోచించడం సమయం వృథా చేయడమేనని ఆమె తేల్చి చెప్పారు.
తన అన్న అర్జున్ కపూర్ గత కొంతకాలంగా నెట్టింట ఎదుర్కొంటున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ జాన్వీ కాస్త ఎమోషనల్ అయ్యారు. విమర్శలు హద్దులు దాటి వేధింపుల స్థాయికి చేరుకున్నప్పుడు అది ఎవరికైనా బాధ కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా అర్జున్ విషయంలో జరుగుతున్న ట్రోలింగ్‌కు ఎలాంటి సాకులు చెప్పలేమని, అటువంటి నెగెటివిటీని వదిలేసి ముందుకు సాగడమే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒకవైపు ఈ వివాదాలు నడుస్తున్నా, జాన్వీ తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' (RC16) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.తండ్రి శ్రీదేవికి తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమని, ఇప్పుడు జాన్వీ కూడా అందుకుంటోంది. 'దేవర'తో ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, 'పెద్ది'తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో జతకట్టి తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
ఒకవైపు వ్యక్తిగత విమర్శలను తిప్పికొడుతూనే, మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ వైఖరి చూస్తుంటే.. ఆమె విమర్శలను మెట్లుగా చేసుకుని ఎదుగుతోందని అర్థమవుతోంది.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications