యష్ ‘టాక్సిక్’ చిచ్చుతో విడాకులు? క్లారిటీ ఇచ్చిన కియారా–సిద్దార్థ్!
Kiara Advani Sidharth Divorce Rumors: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ (Kiara Advani), సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొద్దిరోజులుగా ఈ సెలబ్రిటీ కపుల్ పై సోషల్ మీడియాలో పలు రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. కియారా నటించిన 'టాక్సిక్' (Toxic)సినిమాలోని బోల్డ్ సీన్స్ కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇలా క్లారిటీ ఇచ్చారు.
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, యశ్ (Yash)తో కలిసి నటించారు. ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా కథ, కథనం విషయంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్ వినిపించింది. అదే సమయంలో సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

ముఖ్యంగా కియారా, యశ్ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి తర్వాత కియారా ఇలాంటి సన్నివేశాల్లో నటించడంపై కూడా కొందరు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అలాగే తీవ్ర అసభ్యకర కామెంట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సిద్దార్థ్ మల్హోత్రా కూడా ఈ సన్నివేశాలపై అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం మొదలైంది.
ఆ తర్వాత ఈ రూమర్స్ క్రమంగా మరింత పెద్దవయ్యాయి. వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని, చివరకు ఈ విషయం విడాకుల వరకు వెళ్లిందని కొన్ని సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయి. సిద్దార్థ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారంటూ కూడా కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారం కనిపించలేదు. కియారా, సిద్దార్థ్ కూడా తమ వైవాహిక జీవితంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇలా విడాకుల రూమర్స్ వైరలవుతున్న వేళ..కియారా-సిద్దార్థ్ జంటగా కనిపించారు. వినాయక చవితి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం నిర్వహించిన వేడుకల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా కూడా కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ జంటగా కనిపించిన ఫొటోలు,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఈ రూమర్స్ సమయంలో వీరద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే వారు విడాకుల రూమర్లపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ జంటగా కలిసి బహిరంగ కార్యక్రమానికి హాజరు కావడం మాత్రం ఆ ప్రచారానికి ఇన్‌డైరెక్ట్‌గా చెక్ పెట్టినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. రూమర్స్ పై నేరుగా స్పందించకున్న ఇద్దరూ కలిసి కనిపించడంతో వారి మధ్య ఎలాంటి విభేదాల్లేవనే సంకేతాన్ని ఇచ్చారనే చర్చ మొదలైంది. అయితే.. ఈ రూమార్స్ పై సెలబ్రిటీ జంట ఎలా రియాక్ట్ అవుతుందో? ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
