ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమరిస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తొలి సింగిల్ 'చికిరి చికిరి' 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు తాజాగా రయ్ రయ్ రా రా అనే పాట దుమ్ము లేపుతోంది. ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుందీ సాంగ్. 19 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టుకుంది. అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చడంతో పాటు ఈ పాటను ఆయనే పాడారు. ఇదో మోటివేషనల్ సాంగ్. హీరో ఇంట్రడక్షన్ లో రావొచ్చు.
ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ పై మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ డాన్స్ క్లిప్ ను దీనికి జత చేశారు. పెద్దిలోని 'రయ్ రయ్ రా రా' అనే పాట నిజంగా తెరపై ఓ అగ్ని జ్వాలలా ఉందని చిరంజీవి ప్రశంసించారు. ఎనర్జీ, ఎమోషన్స్, సినిమాటిక్ పెర్ఫార్మెన్స్ ల అద్భుత సమ్మేళనంగా మెగాస్టార్ అభివర్ణించారు. క్లిష్టమైన స్టెప్పులను రామ్ చరణ్ అలవోకగా వేశాడని, మెరుపు వేగంతో కదిలాడని అన్నారు.
#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 3, 2026
Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!
Kudos to… pic.twitter.com/98Wc25JCpT
అంచనాలకు మించి తెరపై వెలిగిపోవడాన్ని చూడటం తండ్రిగా గర్వపడుతున్నానని, అతని డాన్స్ మూమెంట్స్ తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. బుచ్చిబాబు సానా అత్యద్భుత చిత్రీకరణకు, ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ స్వరాలు, గాత్రాలు, జానీ మాస్టర్ పవర్‌ప్యాక్డ్ కొరియోగ్రఫీకి అభినందనలు తెలియజేస్తోన్నానని చెప్పారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్, అనంత శ్రీరామ్ లిరిక్స్ ను చిరంజీవి మెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications