ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో అఖండమైన వేగంతో దూసుకుపోతున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకూ మహారాజ్, అఖండ2 వంటి విజయాల తర్వాత ఆయన ఎనర్జీ లెవెల్స్ అమాంతం పెరిగాయి. కేవలం ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో మూడు చిత్రాల కథలను వింటూ ఖరారు చేసేశారు. ఒకరకంగా బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా దూసుకుపోతూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు.

విజయదశమి లేదా సంక్రాంతి

దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాఫియా బ్యాక్ డ్రాప్ లో తన 111వ చిత్రం చేస్తున్నారు. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని బాలయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే, 2027 సంక్రాంతికి విడుదల చేస్తారు.

Nandamuri Balakrishna is working on projects with Vivek Athreya and Vijay Kanakamedala after gopichand film

కథ పెద్ది కావడంతో రెండు భాగాలు

బాలయ్య తన సాధారణ శైలికి భిన్నంగా వివేక్ ఆత్రేయ వంటి యంగ్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వడం తెలుగు ఫిలింనగర్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ చిత్రానికి 'కురుక్షేత్రం' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఇదే ఖాయమయ్యే అవకాశం ఉంది. కథ చాలా పెద్దదిగా ఉండటంతో రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఈ రెండు భాగాల షూటింగ్‌ను కూడా దాదాపు ఏకకాలంలో పూర్తి చేయాలని దర్శకుడికి బాలకృష్ణ సూచించారు.

కెరీర్ లోనే అత్యంత వేగంగా ఉన్నారు

'నాంది', 'ఉగ్రం' చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల కూడా బాలయ్య రేసులోకి వచ్చారు. విజయ్ చెప్పిన ఒక శక్తిమంతమైన పోలీస్ బ్యాక్‌డ్రాప్ కథకు బాలయ్యకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశారు. దీన్ని చాా తక్కువ బడ్జెట్‌, తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ లేదా విజయ్ కనకమేడల సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడం, భారీ బడ్జెట్ సినిమాలతో పాటు వేగంగా పూర్తయ్యే సినిమాలను బ్యాలెన్స్ చేయడం చూస్తుంటే.. బాలయ్య తన కెరీర్‌లో అత్యంత సూపర్ ఫాస్ట్ దశలో ఉన్నారని, బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+