40 దేశాల్లో.. అండర్‌ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డ్రాగన్' సినిమా గురించి ప్రస్తుతం ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న వార్తలు ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లీకులు బయటకు వస్తున్నాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. డ్రాగన్ సినిమాలో అండర్‌ వరల్డ్ డాన్‌గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను అత్యంత శక్తివంతంగా, ఇంటెన్స్ మాస్ లుక్‌లో చూపిస్తారన్న సంగతి తెలిసిందే 'డ్రాగన్'లో కూడా ఎన్టీఆర్ ఒకే ప్రాంతంలో మాఫియా డాన్ లా కాకుండా అంతర్జాతీయస్థాయి మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుగు సినీ పరిశ్రమలో వార్త చక్కర్లు కొడుతోంది.

చైనాకు చెందిన గ్యాంగ్ స్టర్ పాత్ర

ఈ కథ చైనాకు చెందిన ఒక ప్రముఖ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారంటున్నారు. సాధారణ స్థాయి నుండి ఒక సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగే 'డ్రాగన్' లాంటి వ్యక్తిగా ఎన్టీఆర్ పాత్ర ఉంంది. మొదటి నుంచి ఎన్టీఆర్ నెగెటివ్ పాత్రలకు బాగా ఆకర్షితులవుతుంటారు. ఇందులో కూడా నెగటివ్ షేడ్స్‌తో కూడిన గ్రే క్యారెక్టర్‌గా ఉంటుందని తెలుస్తోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, ఎన్టీఆర్ తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఈ పాత్రకు ప్రాణం పోస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. డ్రాగన్ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 15 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ పాత్ర కోసం ఒక ప్రత్యేకమైన విలాసవంతమైన హౌస్ సెట్‌ను నిర్మించింది. జార్జియా, హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంది. జోర్డాన్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు.

NTR Across forty Countries Tarak Epic Transformation as a Larger-Than-Life Underworld Don

ఎన్ని దేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. 'కాంతార 2' ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. విడుదల ఈ ఏడాది ఉంటుందనుకుంటున్నారుకానీ వచ్చే సంవత్సరం రావొచ్చంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే రోజురోజుకు షూటింగ్ ఆలస్యం జరుగుతుండటంతో వచ్చే ఏడాదికి వెళ్లిపోయింది. 2027లో విడుదలకు చాలా ప్రతిష్టాతక్మమైన సినిమాలున్నాయి. డ్రాగన్ ను 40 దేశాల్లో విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ తో ఎన్ని దేశాల్లోని సినీ ప్రియులను ఆకట్టుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+