రూ.వందల కోట్ల ఆస్తి, ప్రైవేట్ జెట్: టాలీవుడ్ హీరోయిన్ సామ్రాజ్యం

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీ చిత్రం గుర్తిందిగా. అందులో నటించిన రచితారామ్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో 'అదృష్ట దేవత'గా పేరు తెచ్చుకున్న రచితా రామ్, ప్రస్తుతం దక్షిణ భారత దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. 2013లో 'బుల్ బుల్' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ సొట్టబుగ్గల సుందరి, తన పదేళ్ల ప్రయాణంలో కన్నడ అగ్ర హీరోలందరితో నటించి తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా, తనకంటూ ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఈమె ఆస్తుల వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రైవేట్ జెట్.. విలాసవంతమైన లైఫ్ స్టైల్

రచితా రామ్ మొత్తం ఆస్తి విలువ వందల కోట్లలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 3 నుంచి 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటూ కన్నడనాట అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా రికార్డు సృష్టించారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, బుల్లితెరపై రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉండటం ద్వారా ఆమెకు ప్రతి ఏటా భారీ ఆదాయం సమకూరుతోంది. ఆమె లైఫ్‌స్టైల్ కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆమె గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లే కాదు.. ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

Rachita Ram Assets Worth Hundreds of Crores a Private Jet The Empire of a Tollywood Heroine

తెలుగువారికి బాగా తెలుసు

తెలుగు ప్రేక్షకులకు కూడా రచితా రామ్ సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన 'సూపర్ మచ్చి' అనే చిత్రంలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె క్రేజ్ మరింత పెరగడానికి ప్రధాన కారణం 'కూలీ' సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ భారీ చిత్రంలో రచితా ఒక పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేశారు. వ్యక్తిగత విషయానికి వస్తే, తన వివాహంపై రచితా చాలా క్లారిటీతో ఉన్నారు.

సరైన సమయం వచ్చినప్పుడు, తనను, తన వృత్తిని గౌరవించే వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. అప్పటి వరకు తన దృష్టి మొత్తం వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటిగా ఎదగడంపైనే ఉందని స్పష్టం చేశారు. హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి చేసుకున్నా, ఇప్పటికీ అదే వేగంతో దూసుకుపోతూ కొత్త తరం నాయికలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+