అనిరుధ్ - సన్ రైజర్స్ కావ్యమారన్ పెళ్లికి రజనీకాంత్ రాయబారం?

సినిమా గ్లామర్, క్రికెట్ క్రేజ్.. ఈ రెండూ కలిస్తే వచ్చే కిక్కే వేరు. ప్రస్తుతం సోషల్ మీడియాను, కోలీవుడ్ వర్గాలను ఓ రేంజ్‌లో ఊపేస్తోన్న హాట్ టాపిక్ కూడా ఇదే! సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది. ఒకరు ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల దాకా వసూలు చేసే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే, మరొకరు దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యం 'సన్ నెట్‌వర్క్' వారసురాలు. మరి వీరిద్దరి పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజముంది? ఈ వ్యవహారంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నడిపిన రాయబారమేంటి? అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.

లాస్ వేగాస్ డేటింగ్ టు మ్యారేజ్ రూమర్స్!

గత ఏడాది కాలంగా అనిరుధ్, కావ్య మారన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ అమెరికాలోని లాస్ వేగాస్‌లో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, అక్కడ ఓ సీక్రెట్ డిన్నర్ డేట్‌లో కూడా కనిపించారనే టాక్ రావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కెమెరా కంటికి చిక్కే కావ్య (33), తన మ్యూజిక్‌తో థియేటర్లను ఊపేసే అనిరుధ్ (35) వయసు, హోదా పరంగా పర్ఫెక్ట్ జోడీ అంటూ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా మొదలుపెట్టారు.

Rajinikanth Acting as an Intermediary for the Marriage of Anirudh and Sunrisers Kaviya Maran

ప్రొఫెషనల్ రిలేషన్.. పర్సనల్ బంధంగా మారుతోందా?

కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు చెందిన 'సన్ పిక్చర్స్' బ్యానర్‌లో వచ్చే దాదాపు అన్ని ప్రతిష్టాత్మక చిత్రాలకు అనిరుధే ఆస్థాన సంగీత దర్శకుడు. రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ 'జైలర్' నుండి రాబోయే భారీ ప్రాజెక్టుల వరకు మారన్ కుటుంబంతో అనిరుధ్‌కు బలమైన వృత్తిపరమైన అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే కావ్యతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, ఇప్పుడు అది పెళ్లి పీటల వరకు వచ్చిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్ ఉండే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.

రంగంలోకి 'తలైవా'?

ఈ క్రేజీ లవ్ స్టోరీలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ! అనిరుధ్ మరెవరో కాదు.. రజినీకాంత్ భార్య లతకు స్వయానా అన్న కొడుకు. అంటే రజినీకి మేనల్లుడు అవుతాడు. అటు కళానిధి మారన్ కుటుంబానికి, ఇటు రజినీకాంత్‌కు మధ్య దశాబ్దాల కాలంగా విడదీయరాని స్నేహ బంధం ఉంది. ఈ రెండు పెద్ద కుటుంబాలను వియ్యంకులుగా మార్చడానికి స్వయంగా 'తలైవా'నే రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారనే వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కావ్య మారన్‌తో పెళ్లిపై విలేకరులు నేరుగా "సార్, పెళ్లి పత్రిక ఎప్పుడు ఇస్తారు?" అని ప్రశ్నించగా.. అనిరుధ్ ఖండించకుండా, కేవలం చిరునవ్వు నవ్వి "అది వేరే విషయం..." అంటూ దాటవేయడం విశేషం. ఆయన ఇచ్చిన ఈ హింట్ చూస్తుంటే.. నిప్పు లేకుండా పొగ రాదుకదా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+